తీవ్ర విషాదం.. రోడ్డు ప్రమాదంలో TRS నాయకుడు మృతి
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా హైదరాబాద్-శ్రీశైలం జాతీయ ప్రధాన రహదారి వంగురు మండల పరిధిలోని కాటన్ మిల్లు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో టీఆర్ఎస్ నాయకుడు గోవర్ధన్ మృతి చెందాడు. బంధువులు తెలిపిన సమాచారం మేరకు.. అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలం బీకే తీరుమలాపూర్‌కు చెందిన పేరుముల గోవర్ధన్(48) బైక్‌పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. అయితే.. మండలంలో టీఆర్ఎస్ పార్టీలో కీలక భూమిక […]
దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా హైదరాబాద్-శ్రీశైలం జాతీయ ప్రధాన రహదారి వంగురు మండల పరిధిలోని కాటన్ మిల్లు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో టీఆర్ఎస్ నాయకుడు గోవర్ధన్ మృతి చెందాడు.
బంధువులు తెలిపిన సమాచారం మేరకు.. అచ్చంపేట నియోజకవర్గంలోని అమ్రాబాద్ మండలం బీకే తీరుమలాపూర్‌కు చెందిన పేరుముల గోవర్ధన్(48) బైక్‌పై వెళ్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.
అయితే.. మండలంలో టీఆర్ఎస్ పార్టీలో కీలక భూమిక పోషిస్తూ రోడ్డు ప్రమాదంలో గోవర్ధన్ అకాల మరణం చెందడంతో పార్టీకి తీరని లోటు అని మండల నాయకులు వాపోయారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.