రెండేళ్ల అభివృద్ధి నివేదిక విడుదల
దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు. మొదటి ఐదేళ్లకు, ఇప్పటి రెండేళ్లకు మధ్య ఎంతో వ్యత్యాసం కనిపిస్తోంది. ఎన్నెన్నో రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సంక్షేమం, అభివృద్ధితో పాటే విమర్శలు, ఆరోపణలు వరుస కట్టాయి. ప్రజావ్యతిరేక పాలన కొనసాగుతుందంటూ కాంగ్రెస్, బీజేపీ ఆరోపిస్తున్నాయి. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో ఎంతో వృద్ధిని సాధించామని ప్రభుత్వం చెబుతోంది. మొదటి ఐదేళ్లల్లో సీఎం కేసీఆర్ అనేక సభలు, సమావేశాలు నిర్వహించారు. ఈ రెండేళ్లు మాత్రం పార్లమెంటు […]
దిశ, తెలంగాణ బ్యూరో: టీఆర్ఎస్ సర్కారు రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు. మొదటి ఐదేళ్లకు, ఇప్పటి రెండేళ్లకు మధ్య ఎంతో వ్యత్యాసం కనిపిస్తోంది. ఎన్నెన్నో రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. సంక్షేమం, అభివృద్ధితో పాటే విమర్శలు, ఆరోపణలు వరుస కట్టాయి. ప్రజావ్యతిరేక పాలన కొనసాగుతుందంటూ కాంగ్రెస్, బీజేపీ ఆరోపిస్తున్నాయి. వ్యవసాయ, పారిశ్రామిక రంగాలలో ఎంతో వృద్ధిని సాధించామని ప్రభుత్వం చెబుతోంది.
మొదటి ఐదేళ్లల్లో సీఎం కేసీఆర్ అనేక సభలు, సమావేశాలు నిర్వహించారు. ఈ రెండేళ్లు మాత్రం పార్లమెంటు ఎన్నికలు, ఉప ఎన్నికలు, బల్దియా ఎన్నికల రణరంగంలోనే గడిచిపోయాయన్న భావన ఉంది. రైతుబంధు, రైతుబీమా, కాళేశ్వరం ప్రాజెక్టు వంటి అంశాలు చరిత్రలో నిలిచిపోనున్నాయి. కొత్త మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, కొత్త మండలాలతో సరికొత్త పాలనా వ్యవస్థ కొలువుదీరింది. ప్రజలకు సత్వర సేవలందించేందుకు మార్గాలు ఏర్పడ్డాయి. కొత్త మున్సిపల్, పంచాయత్ రాజ్ చట్టాలను అమలు చేశారు. కొత్త ఆర్వోఆర్ చట్టం విమర్శలను ఎదుర్కొంటున్నది. ధరణి పేరుతో తీసుకొచ్చిన రెవెన్యూ పాలనపై ఇంకా అనుమానాలు నివృత్తి కాలేదు. సచివాలయం కూల్చివేతపైన దుమారం రేగింది. కొత్త సచివాలయం నిర్మాణంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ప్రగతిభవన్ నుంచి పాలనను కొనసాగించడం విమర్శల పాలైంది. అక్రమ లేఅవుట్లు, ప్లాట్లను క్రమబద్ధీకరించే పేరిట తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ పై మధ్య తరగతి నుంచి పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. ఈ క్రమంలోనే రెండేళ్ల ప్రగతి నివేదికను ప్రభుత్వం విడుదల చేసింది. 2018 డిసెంబరు 13 నుంచి 2020 డిసెంబరు 12 వరకు అమలు చేసిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అందులో వివరించింది.
వ్యవసాయం
= 2019 వానాకాలం నుంచి రైతుబంధు ఎకరాకు రూ. 8 వేల నుంచి 10 వేలకు పెంపు ( 56 లక్షల మంది రైతులకు లబ్ధి–ఏటా 12 వేల కోట్ల ఖర్చు)
= రైతు బీమా ప్రీమియం రూ.2271 నుంచి రూ.3,556 వరకు పెరిగినా పథకం కొనసాగింపు (దాదాపు 32.73 లక్షల మంది రైతులకు ఏటా రూ.1164 కోట్లు ఖర్చు.)
= 31,654 వేల కుటుంబాలకు 5 లక్షల చొప్పున పైగా రూ.1582 కోట్ల రైతుబీమా సొమ్ము. రెండో దఫా లక్ష లోపు రుణమాఫీ : తొలివిడత రూ.25 వేల లోపు ఉన్న 5.88 లక్షల మందికి రూ.1210 కోట్లు మాఫీ
= మొత్తం రుణాలు రూ. 25,936 కోట్లు, 40.66 లక్షల మంది రైతులకు లబ్ది
= 21 జూన్ 2019న కాళేశ్వరం ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం కేసీఆర్
= ప్రాజెక్టుల ద్వారా 80 లక్షల ఎకరాలకు సాగునీరందుతున్నది. ప్రాజెక్టుల ద్వారా 3,688 చెరువులను నింపారు. చెరువుల కింద 15 లక్షల ఎకరాలు సాగవుతున్నది.
= 2018 జనవరి 1 నుంచి 25 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు 24 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్
= రాష్ట్రంలోని 2,604 క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణం
రెవెన్యూ శాఖ
= సాదా బైనామాల ద్వారా భూముల రిజిస్ట్రేషన్
= ధరణి వెబ్ సైట్ ప్రారంభం : మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి (29 అక్టోబర్ 2020)
= తహసీల్దార్లకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ బాధ్యతలు
= 2 కొత్త జిల్లాలు (ములుగు, నారాయణపేట) ఏర్పాటు. మొత్తం 33
= కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు (44 పాతవి+30 కొత్తవి = 73 మొత్తం)
సంక్షేమం
= 39 లక్షల 35 వేల మందికి ఆసరా పెన్షన్ల రెట్టింపు (మే 2019 నుంచి)
= కొత్తగా 8.5 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ( మరో 6.5 లక్షల మందికి అవకాశం)
పౌర సరఫరాలు
= కరోనా సమయంలో ప్రతి వ్యక్తికీ నెలకు 12 కిలోల చొప్పున 4 నెలల పాటు ఉచితంగా రేషన్ బియ్యం, మూడు నెలలపాలు 2 కిలోల చొప్పున కందిపప్పు, 10 కిలోల చొప్పున 4 నెలలపాటు ఉచితంగా రేషన్ బియ్యం అందజేత. 2020 ఏప్రిల్, మే నెలల్లో ఒక్కో కుటుంబానికి రూ.1500 ఆర్థిక సాయం
పంచాయతీరాజ్
= కొత్త పంచాయతీరాజ్ చట్టం –2018 పక్కాగా అమలు
= గ్రామ పంచాయతీలు (పాతవి 8,690+కొత్తవి 4,079 = 12,769 మొత్తం)
= కొత్తగా 9,355 మంది పంచాయతీ కార్యదర్శుల నియామకం
= పారిశుద్యం, విద్యుత్ పనులు, పురాతన భవనాల కూల్చివేత, శ్మశాన వాటికలు (వైకుంఠధామాలు), డంపింగ్ యార్డులు, ప్రతి గ్రామానికో నర్సరీ, హరితహారం ప్రణాళికలు మొదలైన పనులు చేపట్టారు
స్థానిక సంస్థలు – మున్సిపాలిటీలు
= కొత్త మున్సిపల్ చట్టం అమలు (19 జూలై 2019)
= కొత్తగా ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు (మొత్తం 13)
= బడంగ్ పేట, బండ్లగూడ జాగీర్, మీర్ పేట, బోడుప్పల్, పీర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట
= కొత్తగా 76 మున్సిపాలిటీల ఏర్పాటు (52 పాతవి + 76 కొత్తవి = 128 మొత్తం)
విశ్వనగరంగా హైదరాబాద్
= హైటెక్ సిటీ నుంచి రాయదుర్గం మెట్రో ప్రారంభం (29 నవంబర్ 2019)
= 9 ఫ్లై ఓవర్లు, 4 అండర్ పాస్ లు, 3 ఆర్వోబీలు ప్రారంభం.
= హైదరాబాద్ ఎల్బీనగర్, కామినేని ఫ్లై ఓవర్లు, మైండ్ స్పేస్, బయోడైవర్సిటీ, ఎల్బీనగర్, చింతలకుంట అండర్ పాస్ లు మొదలైనవి ప్రారంభం
= దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి ప్రారంభం (25 సెప్టెంబర్ 2020)
= కరోనా సమయంలో 2 వేల కోట్ల విలువైన 15 ఫ్లై ఓవర్లు, 300 కి.మీ. రోడ్ల పనులు, 29 లింకురోడ్ల నిర్మాణం శరవేగంగా పూర్తి.
= హైదరాబాద్ లో వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం
= రాష్ట్రవ్యాప్తంగా 179 అన్నపూర్ణ భోజనం సెంటర్లు. రోజుకు 52 వేల మందికి భోజనం కరోనా సమయంలో వలస కూలీలకు ప్రత్యేక భోజన ఏర్పాట్లు
ఎల్ఆర్ఎస్
మరోసారి ఎల్.ఆర్.ఎస్ ను ప్రకటన, జీవో 131 విడుదల (1 సెప్టెంబర్ 2020)
ఆర్టీసీ ఉద్యోగులకు వరాలు :
= ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 58 నుంచి 60 ఏండ్లకు పెంపు
= సమ్మె కాలంలో బకాయి పడ్డ వేతనాలు చెల్లింపు
కొత్త సచివాలయం
= కొత్త సచివాలయానికి శంకుస్థాపన (27 జూన్ 2019)
= కొత్తగా 26 జిల్లా కలెక్టరేట్ల భవనాల నిర్మాణం (దాదాపుగా పూర్తి)
= నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలకు 104 క్యాంపు కార్యాలయాలు
= న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ ప్రారంభం ( 17 జూన్ 2019 ప్రారంభం)
పరిశ్రమలు
= ప్రపంచంలోనే అతిపెద్ద క్యాంపస్ ప్రారంభించిన అమెజాన్ (10 జనవరి 2020). 10 ఎకరాల్లో 30 లక్షల చదరపు అడుగుల నిర్మాణం – 9 వేల మంది ఉద్యోగులు. రూ.20,760 కోట్ల భారీ పెట్టుబడి పెట్టేందుకు అమెజాన్ నిర్ణయించింది.
= బయో ఫార్మా రంగానికి ప్రోత్సాహం – రూ.60 కోట్లతో బీ-హబ్
= సిర్పూర్ పేపర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ – 7 ఫిబ్రవరి 2019న ప్రారంభం