యూజ్‌డ్ బైకులను విక్రయం
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ప్రీమియం మోటార్ సైకిల్ తయారీ కంపెనీ ట్రయంఫ్ యూజ్‌డ్ బైక్ ప్రోగ్రామ్.. ‘ట్రయంఫ్ అప్రూవ్‌డ్’ కార్యక్రమాన్ని అక్టోబర్ నెలాఖరులోగా ప్రారంభించాలని నిర్ణయించింది. దేశీయంగా కంపెనీ తన ఉనికిని మరింత పటిష్టం చేసుకునేందుకు ఈ కొత్త కార్యక్రమాన్ని చేపట్టినట్టు కంపెనీ వెల్లడించింది. ఈ కొత్త కార్యక్రమం ద్వారా ఫైనాన్స్ ఆప్షన్లను అందించడంతో పాటు, మొదటిసారిగా ట్రయంఫ్ బైక్‌లను కొనుగోలు చేసే వారిని లక్ష్యంగా పెట్టుకున్నామని ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ బిజినెస్ హెడ్ షోయెబ్ ఫరూక్ తెలిపారు. […]
దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ ప్రీమియం మోటార్ సైకిల్ తయారీ కంపెనీ ట్రయంఫ్ యూజ్‌డ్ బైక్ ప్రోగ్రామ్.. ‘ట్రయంఫ్ అప్రూవ్‌డ్’ కార్యక్రమాన్ని అక్టోబర్ నెలాఖరులోగా ప్రారంభించాలని నిర్ణయించింది. దేశీయంగా కంపెనీ తన ఉనికిని మరింత పటిష్టం చేసుకునేందుకు ఈ కొత్త కార్యక్రమాన్ని చేపట్టినట్టు కంపెనీ వెల్లడించింది. ఈ కొత్త కార్యక్రమం ద్వారా ఫైనాన్స్ ఆప్షన్లను అందించడంతో పాటు, మొదటిసారిగా ట్రయంఫ్ బైక్‌లను కొనుగోలు చేసే వారిని లక్ష్యంగా పెట్టుకున్నామని ట్రయంఫ్ మోటార్‌సైకిల్స్ బిజినెస్ హెడ్ షోయెబ్ ఫరూక్ తెలిపారు.
ట్రయంఫ్ అప్రూవ్‌డ్ పథకమ ఈ నెలాఖరులోగా మూడు డీలర్‌షిప్‌లలో ప్రారంభమవుతుందని, డిసెంబర్ నాటికి క్రమంగా కనీసం 10 డీలర్‌షిప్‌లకు పెంచే ఆలోచనలో ఉన్నట్టు ఆయన స్పష్టం చేశారు. ‘తమ వినియోగదారుల నుంచి వాడిన బైకులను కొనుగోలు చేయబోతున్నాం. వాటిని అప్‌గ్రేడ్ చేసి వారంటీ హామీతో విక్రయించబోతున్నామని షోయెబ్ ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా వినియోగదారుల ఎలాంటి బైకులకు డిమాండ్ ఉందనే దాన్ని బట్టి వాటిని కొత్త వినియోగదారుల వద్దకు చేరుస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ట్రయంఫ్ దేశీయంగా వివిధ వేరియంట్లలో 13 మోడళ్లను విక్రయిస్తోంది.