Trending: మహా కుంభమేళలో అద్భుతం.. ఏకంగా ముళ్లపై పడుకున్న అఘోరా (వీడియో వైరల్)

ఉత్తర్ ప్రదేశ్‌ (Uttar Pradesh)లోని ప్రయాగ్ రాజ్‌ (Prayagraj)లో భూ‌‌మండలంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళ (Maha Kumbhamela) అట్టహాసంగా కొనసాగుతోంది.

Update: 2025-01-16 04:26 GMT
Trending: మహా కుంభమేళలో అద్భుతం.. ఏకంగా ముళ్లపై పడుకున్న అఘోరా (వీడియో వైరల్)
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తర్ ప్రదేశ్‌ (Uttar Pradesh)లోని ప్రయాగ్ రాజ్‌ (Prayagraj)లో భూ‌‌మండలంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళ (Maha Kumbhamela) అట్టహాసంగా కొనసాగుతోంది. పుష్య పౌర్ణమి సందర్భంగా షాహీస్నాన్‌ (Shahisnan)లో భాగంగా గంగా, యమునా, సరస్వతి నదుల పవిత్ర సంగమంలో స్నానం ఆచరించేందుకు ఆఘోరాలు, సన్యాసులు, భక్తులు వివిధ ప్రాంతాల నుంచి కోట్లాదిగా తరలి వస్తున్నారు. ఈ క్రమంలోనే కుంభమేళ (Kumbhmela)లో మరో అద్భుతం చోటుచేసుకుంది. ఓ అఘోరా (Aghora) ఏకంగా పదునైన ముళ్లపై పడుకుని భక్తులను ఆశ్చర్యపరిచారు. దీంతో ఆయనను అక్కడున్న వారు ‘కాంటే వాలే బాబా’గా పిలుస్తున్నారు. అనంతరం అఘోరా మాట్లాడుతూ.. తాను గత 50 ఏళ్లుగా ముళ్లపైనే పడుకుంటున్నానని తెలిపారు. ముళ్లపై పడుకుంటే శరీరానికి మంచి ప్రయోజనాలు చేకూరుతాయని, తనకు ఇంత వరకు ఎలాంటి గాయాలు కాలేదని చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ప్రస్తుతం అఘోరా (Aghora) ముళ్లపై పడుకున్న వీడియో సోషల్ మీడియా (Social Media)లో తెగ వైరల్ అవుతోంది. 

Tags:    

Similar News