Trending: ఆ గ్రామంలో వినూత్నంగా ఉగాది వేడుకలు.. వందల్లో కోళ్లు, మేకలు తెగాల్సిందే
ఉగాది (Ugadi) పండుగ అంటే.. షడ్రుచుల పచ్చడి, పంసందైన భక్ష్యాలే మనందరికీ గుర్తుకొస్తాయి.

దిశ, వెబ్‌డెస్క్: ఉగాది (Ugadi) పండుగ అంటే.. షడ్రుచుల పచ్చడి, పంసందైన భక్ష్యాలే మనందరికీ గుర్తుకొస్తాయి. గుమ్మానికి మామిడాకుల తోరణాలు కట్టి.. ఇంట్లో పూజలు, పునస్కారాలు జోరుగా చేస్తుంటారు. అయితే, చరిత్రలో ఒక్కో ప్రాంతంలో ఉగాది పండుగను ఒక్కో విధంగా జరుపుకుంటారు. సాధారణంగా పండుగ రోజున నాన్‌వెజ్ అసలెవరూ ముట్టుకోరు. కానీ, ఓ గ్రామంలో మాత్రం ఉగాది పండుగను తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా మాంసంతో జరుపుకుంటారండోయ్. వివరాల్లోకి వెళితే.. యాద్రాద్రి భువనగిరి (Yadadri Bhongir) జిల్లా మోత్కూర్ (Motkur) మండల కేంద్రంలో ఉగాది పండుగ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా మారింది. అయితే, పండుగ రోజున పచ్చడి తాగి భక్ష్యాలు తినాల్సిన వారు ఏకంగా నాన్‌వెజ్ లాగించేస్తారు. అయితే, గతంలో గ్రామంలో కలరా (Cholera), మశూచి (Small Pox) వ్యాధులు పెద్ద ఎత్తున ప్రబలడంతో ఊరుఊరంతా గ్రామ దేవత ముత్యాలమ్మకు వ్యాధులు తక్కువ కావాలని వేడుకున్నారు. ప్రతి ఉగాదికి కోళ్లు, మేకలు బలిచ్చి బోనం తీస్తామని మొక్కారట. ఇక అప్పటి నుంచి కొన్న వందల ఏళ్లుగా అదే ఆచారాన్ని గ్రామస్థులు పాటిస్తున్నారు. దీంతో గ్రామస్థులు ఉగాది పండుగ వేళ వందల్లో కోళ్లు, మేకలు బలిస్తూ కొత్త ఏడాదికి నాన్‌వెజ్‌తో గ్రాండ్‌గా వెల్‌కం చెప్పేస్తున్నారు.