వామ్మో.. ఈ బామ్మ దెబ్బకు రజినీకాంత్ బలాదూర్..! (Video Viral)
వృద్ధ వయసులో ఉన్న ఈ బామ్మ మాత్రం యంగ్ గాళ్‌కే సవాల్ విసురుతున్నారు..
దిశ, వెబ్ డెస్క్: వృద్ధ వయసులో నడవడానికే కష్టంగా ఉంటుంది. దీంతో ఇంటి పట్టుకే ఉంటారు. కానీ ఈ బామ్మ మాత్రం యంగ్ గాళ్‌కే సవాల్ విసురుతున్నారు. ఎనర్జీ విషయంలో దుమ్మురేపుతున్నారు. సరిలేరు తనకెవర్వూ అన్నట్టుగా డ్యాన్సులతో అదరగొడుతున్నారు. ఫ్యాంట్, షర్ట్ ధరించి స్టెప్పులు మీద స్టెప్పులు వేస్తోంది. దీంతో జనం వామ్మో బామ్మ.. నిన్ను తట్టుకోవడం కష్టమంటూ ప్రశంసిస్తున్నారు.
రజినీ క్రేజ్ ను వదలని బామ్మ
తమిళనాడులో సూపర్ స్టార్ రజినీకాంత్(Super Star Rajinikanth) క్రేజే వేరు. ఇప్పుడు ఆయన క్రేజ్‌ను కూడా ఈ బామ్మ వాడేసుకుంటున్నారు. ఆయన పేరు చెప్పి ఫాన్ ఫాలోయింగ్ విపరీతంగా పెంచుకుంటున్నారు. రజినీకాంత్ నటించిన కూలీ(Cooli) సినిమాలోని ‘చిట్టు వైబ్’ పాటకు ఆమె ఇటీవల చెలరేగిన పోయి డ్యాన్స్(Dance) చేశారు. అచ్చం రజనీకాంత్‌లా స్టెప్పులు వేశారు. ఎవరూ ఊహించనంత ఉత్సాహంతో బామ్మ చిందులు చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో ఎవరీ బామ్మ ఇంత టాలెంటెడ్‌గా ఉందని అంటున్నారు. త్వరలో ఈమె దెబ్బకు రజనీకాంత్ బలాదూర్ అవడం ఖాయమంటూ సరదాగా కామెంట్స్ పెడుతున్నారు. ఇంత ఎనర్జిట్‌గా డాన్స్ తాము ఫిదా అయ్యామంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.