ఇదేం పిచ్చిరా నాయనా.. బర్త్‌డే సందర్భంగా యువకుడి ప్రైవేట్ పార్ట్‌కు నిప్పంటించిన ఫ్రెండ్స్.. (వీడియో)

సాధారణంగా బర్త్‌డే రోజున సర్‌ప్రైజ్‌ చేద్దామని ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కేక్ తీసుకొచ్చి కట్ చేపిస్తారనే విషయం తెలిసిందే.

Update: 2024-09-27 02:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా బర్త్‌డే రోజున సర్‌ప్రైజ్‌ చేద్దామని ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కేక్ తీసుకొచ్చి కట్ చేపిస్తారనే విషయం తెలిసిందే. కానీ, ఈ ఫ్రెండ్స్ చాలా డిఫరెంట్ గురు. ఎందుకంటే ఈ స్నేహితులు పుట్టిన రోజున పడుకున్న వ్యక్తి ప్రైవేట్ పార్ట్‌కు నిప్పంటించారు. వివరాల్లోకి వెళితే..

ఘర్‌కే కాలేష్ అనే వీడియో ప్రకారం.. ఒక వ్యక్తి గాఢ నిద్రలో ఉన్నాడు. అయితే అప్పుడే వచ్చిన అతని చిలిపి ఫ్రెండ్స్ వెరైటీగా సర్‌ప్రైజ్ చేద్దామనుకున్నారో ఏమో కాబోలు స్ప్రే బాటిల్‌తో అతని రూమ్‌కు వచ్చి అతని అండర్ ప్యాంట్‌కు నిప్పంటించి.. హ్యాపీ బర్త్‌ డే టూ యూ అంటూ గట్టిగా పాడసాగారు. దీంతో సడెన్‌గా లేచిన ఆ యువకుడు నిప్పును చూసి భయంతో వాళ్లని కొట్టడానికి వెళ్లాడు. కానీ కాసేపు ఆగిన తర్వాత అతని కోపం చల్లారి వాళ్ళతో కలిసిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తుంది. దీనిపై నెటిజన్లు ఫన్నీగా ఉందని కొందరు.. ఇది చాలా డేంజర్‌ సర్‌ప్రైజ్ అని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి మీరు ఈ ఫన్నీ వీడియో పై ఓ లుక్ వేసేయండి.

(video link credits to ghar ke kalesh X account)


Similar News