Viral Note : పండక్కి వెళుతూ ఇంటి దొంగలకు నోట్ రాసిపెట్టిన యజమాని.. నెట్టింట్లో వైరల్
సంక్రాంతి పండక్కి(Sankranthi Festival) ఊరికి వెళుతూ.. ఓ ఇంటి యజమాని దొంగలకు వింత నోట్ రాశి పెట్టిన ఫోటో ఒకటి నెట్లో వైరల్(Viral) అవుతోంది.
దిశ, వెబ్ డెస్క్ : సంక్రాంతి పండక్కి(Sankranthi Festival) ఊరికి వెళుతూ.. ఓ ఇంటి యజమాని దొంగలకు వింత నోట్ రాశి పెట్టిన ఫోటో ఒకటి నెట్లో వైరల్(Viral) అవుతోంది. సాధారణంగా పండక్కి సొంత ఊర్లకు వెళ్ళే వారు ఇంట్లో ఉన్న డబ్బు, నగలను ఇంట్లోనే ఉంచి వెళ్తే ఎక్కడ దొంగలు పడి దోచేస్తారో అనే భయం ఉంటుంది. పండగలకు ఊర్లకు వెళ్ళిన ఖాళీ ఇళ్లను చూసి దొంగలు కూడా రెచ్చిపోతారు. అయితే ఇలాంటివేవి జరగకుండా ఓ ఇంటి యజమాని దొంగలకు షాక్ ఇచ్చాడు. "మేము సంక్రాంతికి ఊరికి పోతున్నాం. డబ్బు, నగలు తీసుకొని పోతున్నాము, మా ఇంటికి రాకండి. ఇట్లు మీ శ్రేయోభిలాషి అంటూ నోట్ రాసి ఇంటి డోర్ కి అతికించాడు. దీనిని చూసిన ఓ వ్యక్తి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. తెగ వైరల్ అవుతోంది. ఈయనెవరో మరీ ముందు జాగ్రత్తపరుడులా ఉన్నాడని, దొంగలకు లెటర్ రాసి వారి శ్రమ తగ్గించాడని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ జరిగిందో మాత్రం తెలియలేదు.