Rashmi: నాగ శౌర్య వీడియోపై వైరల్ అవుతున్న యాంకర్ రష్మీ ట్వీట్

నాగ శౌర్య నిన్న రీల్ హీరో నుంచి రియల్ హీరో అయ్యాడు.

Update: 2023-03-01 04:59 GMT

 దిశ, వెబ్ డెస్క్ : నాగ శౌర్య నిన్న రీల్ హీరో నుంచి రియల్ హీరో అయ్యాడు. ఒక యువకుడు తను ప్రేమించిన అమ్మాయిని రోడ్ మీద చేయి చేసుకున్నాడు. అది చూసిన నాగ శౌర్య కారు నుంచి దిగి.. నీ లవర్ అయితే కొడతావా? ముందు ఆమెకు సారీ చెప్పు..అంటూ గట్టిగా నిలదీసాడు. వాడి లవర్ను వాడి కొడితే నాగ శౌర్య నిలదీయడం కరెక్ట్ కాదని అంటున్నారు.. ఇంకొందరు వాడిని ఇంకా గట్టిగా కొట్టాలి లేకపోతే ఒక ఆడ పిల్లని నడి రోడ్ మీద కొడుతాడా ? అని అంటున్నారు.

కామెంట్స్ చదివిన రష్మికి బాగా కోపం వచ్చి నట్టుంది. నెటిజెన్ల కామెంట్స్‌ని స్క్రీన్ షాట్లు తీసి ట్వీట్ చేసింది. వాడి లవర్ వాడి ఇష్టమంట.. ఆమె సపోర్ట్ చేస్తుందిగ .. ఇలాంటి చెత్త కామెంట్లు చూస్తుంటే నాకు సిగ్గేస్తోంది.. ఆ అమ్మాయి ఏ పరిస్థితిలో ఉందో మనకి తెలీదు కదా.. మీరందరూ ఇంకో ఆత్మ హత్య చూడాలనుకుంటున్నారా? అంటూ గట్టిగా పోస్ట్ చేసింది. 

Also Read..

లవర్తో లేచిపోయిన పెళ్లాం.. భర్త చేసిన పనికి నోరెళ్లబెట్టాల్సిందే..! 

Tags:    

Similar News