సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కొయ్ కొయ్ సాంగ్

ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వందలాదిమంది ఫేమస్ అవుతున్నారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్ లో ఫేమస్ అయిన ఎంతోమంది చిన్నపాటి సెలబ్రేటిలు గా మారిపోతున్నారు.

Update: 2025-01-14 11:19 GMT
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కొయ్ కొయ్ సాంగ్
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో వందలాదిమంది ఫేమస్ అవుతున్నారు. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్(Instagram)లో ఫేమస్ అయిన ఎంతోమంది చిన్నపాటి సెలబ్రేటిలు గా మారిపోతున్నారు. దీంతో వారికి టీవీ, సినిమాలతో పాటు బిగ్ బాస్, యూట్యూబ్ ఇంటర్వ్యూలలో చాన్సులు దక్కుతున్నాయి. ఈ క్రమంలోనే న్యూయర్ వేడుకలకు ముందు ఓ ఫాస్టర్ పాడని "కొయారే కొయ్ కొయ్ బామారే సందమామ"(Koyare Koi Koi Bamare Sandamama") సోషల్ మీడియాను షేక్(షేక్) చేసింది. ఎక్కడ చూసిన ఈ పాటను రీమేక్ చేస్తూ రీల్స్ చేస్తుండటంతో.. ఆ పాటను పాడిన ఫాస్టర్(Paster) ప్రస్తుతం సోషల్ మీడియా సెలబ్రేటి అయిపోయాడు.

దీంతో పలువురు యువకులు అతన్ని కలిసి స్థానికంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తీసుకొచ్చి.. మరోసారి ఆయనతో పాట పాడించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ మారింది. దీంతో ఆ వీడియోను ట్యాగ్ చేస్తూ.. తెలుగు ప్రజలకు మరో సెలబ్రెటి దొరికాడని.. టీవీ సీరియల్స్, బిగ్ బాస్, యూట్యూబ్ చానెళ్లకు మంచి క్యాండిడేట్ దొరికాడని కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికి సోషల్ మీడియాను ఈ కొయ్ కొయ్ సాంగ్ షేక్ చేస్తుందనే చెప్పుకొవాలి.


Similar News