Viral Video: ఛీ.. ఛీ ఆలయంలో ఇదేం పాడుబుద్ధి.. అతను చేసిన పని తెలిస్తే నోరెళ్లబెడతారు!
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చిత్రివిచిత్ర ఘటనలతో పాటు షాకింగ్ ఘటనలు కూడా వెలుగు చూస్తుండడం గమనిస్తూనే ఉన్నాం

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చిత్రివిచిత్ర ఘటనలతో పాటు షాకింగ్ ఘటనలు కూడా వెలుగు చూస్తుండడం గమనిస్తూనే ఉన్నాం. తాజాగా షాకింగ్ ఘటనకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. అతని వయసు 50కి పైగా ఉంటుంది. పిల్లలకు మంచి, చెడు చెప్పాల్సిన ఓ వ్యక్తి తప్పుడు పనికి పాల్పడ్డాడు. దైవదర్శనానికి ఆలయానికి వచ్చిన ఆ వ్యక్తి వక్రబుద్ది బయటపెట్టాడు. వయసుకు తగ్గ సంస్కారం లేకుండా ప్రవర్తించాడు.
ఆలయంలో అతని ఎదురుగా ఓ యువతి కూర్చుంది. అతను పదే పదే ఆమెను చూస్తున్నాడు. ఆ తర్వాత అతను ఫోన్ తీసి ఆ యువతిని అసభ్యకర ఫొటోలు తీశాడు. దీనిని గమనించిన సదరు యువతి కాస్త ఓపికగా భరించింది. అయిన అతను ఫోన్ లో ఫొటోలతో ఆమెను అసభ్యకరంగా చూడటం మొదలుపెట్టారు. దీంతో ఆగ్రహానికి గురైన యువతి అతని వద్దకు వచ్చి నిలదీసింది. ఈ క్రమంలో ఆ వ్యక్తి తానేమి తప్పు చేయలేదని బుకాయించాడు. అయితే ఆ వ్యక్తి కూర్చున్న యువతి కాళ్లను రహస్యంగా ఫొటోలు తీశారు. ఇది గమనించిన సదరు యువతి అతన్ని రెడ్ హ్యండెడ్‌గా పట్టుకుంది.
దేవాలయంలో ఇలా చేయడానికి సిగ్గు లేదా? అని ఫైరయ్యింది. ఈ క్రమంలో అతని ఫోన్ లో ఉన్న గ్యాలరీని ఓపెన్ చేసి అతను తీసిన ఫొటోలు ఆమె బయటపెట్టింది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియనప్పటికీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు తండ్రి వయసులో ఉన్న వ్యక్తి ఇలా చేయడం సిగ్గు చేటు అంటూ మండిపడుతున్నారు. దేవాలయాల్లో కూడా మహిళలకు రక్షణ కరువైందని కామెంట్స్ పెడుతున్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకుంటేనే మిగిలిన వారికి భయం ఉంటుందని కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.
https://www.instagram.com/reel/DIakZvfP_C3/?utm_source=ig_web_copy_link