ఆ రాష్ట్రానికి వెళ్లాలనుకునే పర్యాటకులకు చెత్త బుట్ట లేకుంటే నో ఎంట్రీ!

ఎక్కడి కైనా వెళ్లాలనుకునే వారికి పాస్ పోస్ట్ బోర్డింగ్ పాస్ ఉంటే సరిపోతుంది.

Update: 2024-07-27 09:23 GMT

దిశ, ఫీచర్స్: ఎక్కడి కైనా వెళ్లాలనుకునే వారికి పాస్ పోస్ట్ బోర్డింగ్ పాస్ ఉంటే సరిపోతుంది. కానీ ఓ రాష్ట్రానికి వెళ్లాలనుకునే వారు కచ్చితంగా చెత్త బుట్టను తమ వెంట ఉంచుకోవాల్సిందేనట. డస్ట్ బిన్ లేకపోతే.. పర్యాటకులైనా సరే ఆ రాష్ట్రంలోకి అనుమతించకుండా వెనక్కి పంపేస్తారని సమాచారం. ఎక్కడికి వెళ్లినా కానీ చెత్త బుట్టను వెంటపెట్టుకుని వెళ్లాల్సిందేనట. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలిసిన నెటిజన్లు ఇదేం విడ్డూరం అని షాక్ అవుతున్నారు.

అసలు విషయంలోకి వెళితే.. సిక్కిం రాష్ట్రంలో చెత్తబుట్ట లేకపోతే ఎంట్రీ ఉండదు. ఖచ్చితంగా మీతో చెత్తబుట్టను తీసుకెళ్తేనే అక్కడి అధికారులు మీకు అనుమతిస్తారు. లేక పోతే ఎంట్రీ ఉండదు. టూరిస్ట్ వాహనాలు కూడా చెత్త బుట్టను లేదా బ్యాగ్‌ను తప్పనిసరిగా తమ వెంట పెట్టుకోవాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. అలా కాదని ఏదైనా వాహనంలో చెత్త సంచులు, బుట్టి లేకుండా అసలు సిక్కిం రాష్ట్రంలోకి అసలు అనుమతించరు. అలాగే అక్కడికి వెళ్లే పర్యాటకులకు అవగాహన కల్పించడంలో పూర్తి బాధ్యత టూర్ ఆపరేటర్లు, ట్రావెల్ ఏజెన్సీలు, వాహన డ్రైవర్లదే అని అధికారులు తెలిపారు.

అయితే అక్కడికి వెళ్లినా కూడా చెత్త బుట్టను మీ వెంట పెట్టుకుని వెళ్లాలి. అలా కాదని వాకింగ్ వెళ్ళినప్పుడు ఏదైనా తినేసి పడేస్తే అధికారులు చర్చలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్కడి ప్రజలకు కూడా ఆ నిబంధన పాటిస్తున్నారట. అయితే సిక్కిం రాష్ట్రంలోని అధికారులు ఇలా కండీషన్స్ పెట్టడానికి కారణం పరిశుభ్రత, పర్యావరణం పై అవగాహన కల్పించడంతో పాటుగా ప్రజలు శుభ్రంగా ఉండకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి కాబట్టి ఇలా చేశారని సమాచారం. ప్రజెంట్ ఈ నిబంధన తెలిసిన వారు కొందరు ఆశ్చర్యపోతున్నారు. మరికొందరు మాత్రం ఐడియా అదుర్స్ అని అంటున్నారు.


Similar News