గిబ్లీ వాడకంలో ఏ రాష్ట్రం టాప్ లో ఉందో తెలుసా..?
సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు గిబ్లి స్టైల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు.

దిశ, వెబ్‌డెస్క్ : సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు గిబ్లి స్టైల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా గిబ్లి స్టైల్ ట్రెండ్ నడుస్తోంది. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్,ట్విట్టర్ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ ఏదైనా కానీ.. గిబ్లీ ఫోటోలే కనిపిస్తున్నాయి. తమకు నచ్చిన ఫోటోలను కన్వర్ట్ చేసుకుని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. గిబ్లీ లానే పలు ఎఫెక్ట్ లు ఉన్నప్పటికీ ప్రజెంట్ ఈ ఫోటోల ట్రెండ్ ఎక్కువగా నడుస్తోంది. అలానే గిబ్లీ ఫోటోలు క్రియేట్ చేసుకునేందుకు ఛాట్ జీపీటీ, గ్రోక్ ద్వారా ఫ్రీగా క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. జీపీటీ ప్లస్, ప్రో సబ్ స్క్రిప్షన్ తీసుకున్న వారు ఎలాంటి పరిమితి లేకుండా ఫోటోలను మార్చుకునే అవకాశం అందిస్తుంది. సబ్ స్క్రిప్షన్ లేనివాళ్లు పరిమిత సంఖ్యలో ఫోటోలను కన్వర్ట్ చేసుకోవచ్చు.
ప్రస్తుతం మన దేశంలో ఈ ఫీచర్ ను ఓ రేంజ్ లో వాడేస్తున్నారు. గిబ్లీని ఎక్కువగా ఉపయోగించే దేశాల్లో భారత్ టాప్ 5లో ఉన్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. గూగుల్ ట్రెండ్స్ డేటా ప్రకారం గత వారం రోజులుగా ఇండియాలో ఈ ఫీచర్ ను నెటిజన్లు బాగా వినియోగిస్తున్నట్లు తేలింది. అయితే గత వారం రోజులుగా గిబ్లీ ఫీచర్ ను అత్యధిక స్థాయిలో వాడుతున్న లిస్టులో మహారాష్ట్ర ఉంది. ఆ తర్వాత రెండు, మూడు స్థానాల్లో గుజరాత్, అస్సాం నిలిచాయి. అదే విధంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో 74 శాతం, ఏపీలో 66 శాతం నెటిజన్లు ఈ ఫీచర్ ను ఉపయోగిస్తున్నట్లు తేలింది. మరోవైపు మిజోరాం, మణిపూర్, జమ్మూ కాశ్మీర్, నాగాలాండ్, మేఘాలయ, పంజాబ్, బీహార్ రాష్ట్రాలు గిబ్లీ పట్ల తక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తోంది.