Viral News: ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన రెండేళ్ల చిన్నారి.. రికార్డు బ్రేక్

అప్పుడప్పుడే తప్పటడుగులు వేస్తూ నడక నేర్చుకుంటున్న రెండేళ్ల చిన్నారి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి ఇప్పటి వరకు ఉన్న రికార్డును బ్రేక్ చేసింది.

Update: 2024-03-28 04:19 GMT
Viral News: ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన రెండేళ్ల చిన్నారి.. రికార్డు బ్రేక్
  • whatsapp icon

దిశ వెబ్ డెస్క్: అప్పుడప్పుడే తప్పటడుగులు వేస్తూ నడక నేర్చుకుంటున్న రెండేళ్ల చిన్నారి ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి ఇప్పటి వరకు ఉన్న రికార్డును బ్రేక్ చేసింది. వివరాల్లోకి వెళ్తే.. మధ్య ప్రదేశ్ లోని భోపాల్ ప్రాంతానికి చెందిన సిద్ది మిశ్రా అనే రెండేళ్ల చిన్నారి ఎవరెస్టు బేస్ క్యాప్ వరకు వెళ్లి వచ్చింది. చిన్నారి తల్లిదండ్రులతో కలిసి ఈ నెల 12వ తేదీన ఎవరెస్టు బేస్ క్యాప్ వరకు వెళ్ళింది.

చిన్నారిని తీసుకుని దాదాపు పది రోజులు ట్రిక్కింగ్ చేశారు ఆ తల్లిదండ్రులు. కాగా చిన్నారి తల్లి భావన సైతం ఎవరుస్టు శిఖరాన్ని అధిరోహించారు. ఇక సిద్ది మిశ్రాని తన తండ్రి బుజాల మీద మోసుకుంటూ ఎవరెస్టు బేస్ క్యాప్ వరకు తీసుకు వెళ్లారు. దీనితో ఇప్పటివరకు ఉన్న రికార్డును సిద్ది మిశ్రా బ్రేక్ చేసింది. రెండేళ్ల వయసులోనే ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన చిన్నారిగా రికార్డు సాధించింది. 

Tags:    

Similar News