తేలుపై కోర్టులో కేసు.. అతన్ని ఎక్కడ కుట్టిందో తెలిస్తే షాకవ్వాల్సిందే! ట్వీట్ వైరల్

ప్రపంచంలో రోజూ ఎక్కడో ఒకచోట ఆసక్తికర, వింత ఘటనలు చోటుచేసుకుంటూనే ఉంటాయి.

Update: 2024-03-06 14:31 GMT

దిశ, ఫీచర్స్: ప్రపంచంలో రోజూ ఎక్కడో ఒకచోట ఆసక్తికర, వింత ఘటనలు చోటుచేసుకుంటూనే ఉంటాయి. గతంలో సోషల్ మీడియా ప్రభావం అంతగా లేని సమయంలో వింతలు, విశేషాలు ఆ ప్రాంతాల వరకే పరిమితం అయ్యేవి. కానీ, ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం ఏ రేంజ్‌లో ఉండో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అమెరికా అధ్యక్షుడు తాగే టీ ప్రత్యేకతకు సంబంధించిన వార్తలు కూడా క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. అయితే, ఇందులో కొన్ని సమాజాన్ని కదిలించేవి ఉంటుండగా.. మరికొన్ని సిల్లీగా కూడా ఉంటున్నాయి. తాజాగా మరో ఆసక్తికర వార్త ఇప్పుడు ట్రెండ్ అవుతోంది.

కాలిఫోర్నియాలో ఓ వ్యక్తి తేలుపై కోర్టులో కేసు వేశాడు. అదేంటి.. ఎవరైనా వ్యక్తులు, సంస్థలపై కేసులు వేస్తారు కానీ, ఇలా తేళ్లు, పురుగులపై కూడా వేస్తారా? అని ఆశ్చర్యపోతున్నారా? అవును మీరు విన్నది నిజమే. కాలిఫోర్నియాలో మైఖెల్ అనే ఒక వ్యక్తి గదిలో నిద్రిస్తున్న సమయంలో అతిని ప్యాంటులోకి తేలు దూరింది. మెల్లగా పాకి అతని ప్రయివేట్ పార్టు(పురుషాంగం)ను కుట్టింది.

దీంతో మంట.. మంట అంటూ అల్లాడిపోయిన అతను కోర్టులో దావా వేశాడు. ఈ విషయాన్ని మైఖెల్ ఇటీవల ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీంతో ఈ వార్త చదివిన నెటిజన్లంతా ఆశ్చర్యపోతున్నారు. మంచి పనిచేశావు బ్రో.. మళ్లీ ఎవరైనా కుట్టాలంటే తేళ్లు భయంతో పరుగులు తీస్తాయని సరదాగా కామెంట్లు పెడుతున్నారు.


Similar News