LORRY DRIVER : నెలకు పది లక్షలు సంపాదిస్తున్న లారీ డ్రైవర్... సినిమా కన్నా పెద్ద ట్విస్ట్ ఇదైతే...
సోషల్ మీడియా ఎవరిని ఎప్పుడు పైకి లేపుతుందో.. ఏ టైంలో తొక్కి పడేస్తుందో చెప్పలేం.
దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియా ఎవరిని ఎప్పుడు పైకి లేపుతుందో.. ఏ టైంలో తొక్కి పడేస్తుందో చెప్పలేం. ముంబై బస్తీ అమ్మాయిని మోడల్ గా మార్చేసింది.. పల్లీలు అమ్ముకునే వ్యక్తిని సింగర్ ను చేసింది... కుర్చీ మడతపెట్టి తాతను సెన్సేషన్ గా క్రియేట్ చేసింది. ఇలా ఇల్లు గడవలేని స్థితిలో ఉన్న ఎంతో మందిమి లక్షాధికారులను చేసింది. కేవలం కంటెంట్ ఉండి... వ్యూయర్స్ ఆకట్టుకునేలా ప్రెజెంట్ చేస్తే.. కమిట్మెంట్ తో ముందుకు సాగితే సక్సెస్ దానంతట అదే వస్తుందని చెప్పేందుకు మరో ఉదాహరణ ఈ లారీ డ్రైవర్.
జార్ఖండ్ రాష్ట్రం జాంతారాకు చెందిన రాజేష్ రావాని 25ఏళ్లుగా లారీ నడుపుతున్నాడు. ఈ క్రమంలో రాష్ట్రాలు దాటి ప్రయాణించాల్సి వస్తుంది. రోడ్ల మీద బండి ఆపుకుని వంట చేసుకుని.. అక్కడే తినాల్సి ఉంటుంది. అయితే ఇలా రోడ్లపై తను చేసుకునే ఫుడ్ ప్రిపరేషన్ గురించి వీడియోలు చేసిన రాజేష్ .. తొందరలోనే ఫాలోవర్స్ ను సంపాదించాడు. ప్రస్తుతం
యూట్యూబ్ లో ఏకంగా 1.86 మిలియన్ ఫాలోవర్స్ ను కలిగి ఉన్న ఆయన.. కొత్తగా ఇల్లు కొన్నాడు. నెలకు రూ. 10 లక్షలు సంపాదిస్తున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతుండంగా.. ఆయన కమిట్మెంట్ గురించి పొగుడుతున్నారు నెటిజన్లు. ఇంకొందరు ఇండియాలో ఎడ్యుకేషన్ పెద్ద స్కామ్.. చదువుకున్నోడు రోడ్ల మీద తిరిగితే చదువుకోనివాడు కోట్లు సంపాదిస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.