4 ఏళ్ల ప్రేమ.. విషాదంగా ఎలా ముగిసిందంటే..? (వీడియో)

వారిద్దరి ప్రపంచాలు వేరు.. జీవన విధానాలు వేరు.. ఆమె ఓ ధనవంతురాలు.. అతడేమో కెన్యాలోని అరుదైన సంబురు తెగకు చెందిన యువకుడు.

Update: 2023-07-19 13:41 GMT

దిశ, వెబ్‌డెస్క్: వారిద్దరి ప్రపంచాలు వేరు.. జీవన విధానాలు వేరు.. ఆమె ఓ ధనవంతురాలు.. అతడేమో కెన్యాలోని అరుదైన సంబురు తెగకు చెందిన యువకుడు. కానీ వీరిద్దరిని ఒక్కటి చేసింది ప్రేమ. పెళ్లి కూడా చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చారు. కానీ, చివరకు ఈ ప్రేమ వివాహం విషాదంగా ముగిసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

21 ఏళ్ల వయసులోనే సక్సెస్ ఫుల్ బిజినెస్ ఉమెన్‌గా పేరుతెచ్చుకున్న మహిళ కొరిన్. స్విట్జర్ లాండ్ దేశానికి చెందిన ఆమె.. మార్కో అనే యువకుడితో సహజీవనం చేస్తూ సంతోషకరమైన జీవితాన్ని గడుపుతూ ఉండేది. సక్సెస్ ఫుల్ బిజినెస్, లగ్జరీ లైఫ్ అనుభవిస్తూ ఆనందంగా ఉండేది. తను సహజీవనం చేస్తున్న మార్కో కూడా చాలా డబ్బు ఉన్నవాడు. దీంతో ఇద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు. అలా సంతోషంగా సాగుతున్న వీరి జీవితం బోర్ కొట్టినట్టు ఉంది. దీంతో అడ్వెంచర్ ట్రిప్ కు వెళ్లాలని భావించారు.

మార్కో, కొరిన్. 1986 లో కెన్యా దెశానికి పయనమయ్యారు. అప్పుడు కొరిన్‌ 26 ఏళ్ళ యువతి. ఆ యాత్రలో ఇద్దరూ చాలా ఎంజాయ్ చేశారు. కెన్యా దేశ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాల గురించి అన్ని విషయాలు ఎంతో తెలుసుకున్నారు. అదే సమయంలో ఓరోజు కొరిన్ దంపతులు సంబురు తెగలోని యోధులను కలుసుకున్నారు. ఇక్కడే కొరిన్ కొత్త ప్రేమ కథకు బీజం పడింది. సంబురు తెగ యోధుల్లో ఒకడైన లుకెటింగాను చూసింది. అతడు చూడడానికి పొడవుగా, కండలు తిరిగిన దేహంతో ఆజానుబాహుడులా ఉంటాడు.

తెగలో అతడి సాహసాల గురించి కథలు కథలుగా విని తెలియకుండానే అతడి మీద ఇష్టం పెంచుకుంది కొరిన్. ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారడంతో మొదటి భర్తకు విడాకులు ఇచ్చేసింది. కుటుంబంలో వారికి పెళ్లికి ఒప్పించి లుకెటింగాను పెళ్లి చేసుకుంది. వారికి ఓ పాప కూడా జన్మించింది. అయితే వీరి ప్రేమ ఎంతో కాలం సంతోషంగా సాగలేదు. 4 ఏళ్లకే ఇద్దరు విడిపోయారు. లుకెటింగాను ప్రేమించి పెళ్లి చేసుకున్న కొరిన్ అతడి నుంచి ఎందుకు విడిపోయింది.. ఎలా విడిపోయింది.. అసలు వాళ్ల మధ్య ఏం జరిగింది.. వారికి పుట్టిన పాప ఏం అయింది. ఈ విషయాలు అన్ని తెలుసుకోవాలంటే కింద ఉన్న లింక్ ఓపెన్ చేసి చూడాల్సిందే.


Similar News