బహిరంగంగా డేటింగ్ చేస్తా.. ఒక్కరోజు మాత్రమే చాన్స్.. నెట్టింట దుమారం రేపుతోన్న 22 ఏళ్ల అమ్మాయి కామెంట్స్

తాజాగా ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో 22 రెండేళ్ల ఓ అమ్మాయి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.

Update: 2024-03-18 11:32 GMT

దిశ, ఫీచర్స్: తాజాగా ఆన్‌లైన్ ఇంటర్వ్యూలో 22 రెండేళ్ల ఓ అమ్మాయి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. ఎలాంటి మోహమాటం లేకుండా తనతో డేటింగ్ చేయాలంటే ఈ కండిషన్స్ పాటించాలంటూ చెప్పుకొచ్చింది తైమ్ కౌర్ అనే యువతి. ఈ ఎనిమిది కండిషన్స్ కు ఓకే అంటే డేటింగ్‌కు తాను సిద్ధమంటోంది. ప్రస్తుతం తైమ్ కౌర్ ఇంటర్వ్యూలో చేసిన బోల్డ్ కామెంట్స్ కుర్రాళ్ల మతిపోగుతున్నాయి. తైమ్ కౌర్ మాట్లాడుతూ..

‘‘నా సమయం వృథా చేసుకోవద్దనే ఉద్ధేశంతో ఈ కండిషన్స్ పెట్టడం జరిగింది. గతంలో కూడా నేను డేటింగ్ చేశాను. ఆ తర్వాత ఈ 8 నియమాలు పెట్టుకున్నాను. 1. గురువారం మాత్రమే డేటింగ్ చేస్తాను. 1 వ తారీకున కూడా ఫిజికల్ గా కలవడం కుదరదు. 2. నేను మహిళను కాబట్టి సోషల్ మీడియా ప్రొఫైల్ చెక్ చేస్తారు కాబట్టి నేను అందులో యాక్టివ్ గా ఉండనంటూ టాపిక్‌ను ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ గా మార్చేసింది. అది కేవలం తన వ్యక్తిగత భద్రత , రక్షణ కోసం తప్పనిసరంటూ వెల్లడించింది. 3. నేను నెలలో ఏడు రోజులు మాత్రమే డేటింగ్ చేయగలను.

అంతకంటే ఎక్కువ సమయం తీసుకుంటే మీకు నాకు ఇద్దరికి మంచిది కాదు. 4. 1st తారీకునే అబ్బాయి అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. 5. డేటింగ్ స్టార్ట్ చేసే ముందు నేను అబ్బాయి గురించి అన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇది ఒక రకమైన టెస్ట్. 6. డేటింగ్ తక్కువ సమయం ఉండాలి. అలాగే మధ్యాహ్నం సమయంలో ఉండాలి. అది కూడా బహిరంగ ప్రదేశంలో ఉండాలి. మద్యం లేకుండా డేటింగ్ జరగాలి. నాతో డేటింగ్ చేసే వ్యక్తి నా మాటలను శ్రద్ధగా వినాలి. కంటి చూపులతో నాతో మాట్లాడాలి. కచ్చితంగా ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉండాలి.

అక్కడ పని చేసే సిబ్బందికి రెస్పెక్ట్ ఇవ్వాలి. అలాగే నా నుంచి ఎలాంటి ప్రశంసలు ఆశించవద్దు. 7. నన్ను డిన్నర్‌కి తీసుకెళ్లి, డేట్‌కి తీసుకెళ్లినంత మాత్రాన నేను మీతో శారీరకంగా ఎలాంటి క్షణాలు గడిపేందుకు అనుమతిస్తానని అర్థం కాదు. అబ్బాయిలు మొదటి డేట్ నాడే ఫిజికల్ గా కలవాలని ఆశించకూడదు. ముద్దు తర్వాత ఇంకా సంతృప్తి చెందకపోతే గుడ్ బై. 8. మీలో లైంగిక దృడత్వం లేదని నాకు అనిపించినా లేదా అవతలి వ్యక్తిని తాను ఆకర్షించలేకపోయానని అనుకుంటే అంతటితో సెలవు అంటూ తైమ్ కౌర్ చెప్పుకొచ్చింది.


Similar News