హరితహారంలో భాగస్వాములు కావాలి : ట్రస్మా

           ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు, అధ్యాపక బృందాలు, విద్యార్థులు హరితహారం కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని నిజామాబాద్ జిల్లా ట్రస్మా అధ్యక్షులు జయసింహగౌడ్ పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని ట్రస్మా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రయివేటు పాఠశాలలు యాజమాన్యలు, ఉపాద్యాయులు, […]

Update: 2020-02-15 08:03 GMT

ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రయివేటు పాఠశాలల యాజమాన్యాలు, అధ్యాపక బృందాలు, విద్యార్థులు హరితహారం కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని నిజామాబాద్ జిల్లా ట్రస్మా అధ్యక్షులు జయసింహగౌడ్ పిలుపునిచ్చారు. శనివారం నగరంలోని ట్రస్మా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లాలోని అన్ని ప్రయివేటు పాఠశాలలు యాజమాన్యలు, ఉపాద్యాయులు, విద్యార్థులు భాగస్వాములు కావాలని కోరారు. జిల్లాలోని సుమారు 400లకు పైగా పాఠశాలలో దాదాపు 80000మంది విద్యార్థులు మొత్తం ఒక్కొక్కరు ఐదు చొప్పున మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈనెల 17వ తేదీన ప్రతి పాఠశాల యాజమాన్యం హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలను నాటి సుమారు 2లక్షల వరకూ మొక్కలు నాటిన వారవుతారని వాటి ద్వారా భావితరాల వారికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

Tags:    

Similar News