వేసిన చెత్తను ఇంటికి పంపించారు!

దిశ, వెబ్‌డెస్క్: ఏదైనా పార్క్‌కు సరదాగా పిక్నిక్ వెళ్లినపుడు అక్కడ బాగా ఎంజాయ్ చేసి, తినేసి, తాగేసి ఇంటికి ఆనందంగా తిరిగొస్తారు. కానీ మీరు ఎంజాయ్ చేసిన ప్రదేశంలోనే ప్లాస్టిక్ కప్పులు, బాటిళ్లను వదిలేస్తారు. అలా చేయొద్దని పార్క్ అధికారులు ఎంత చెప్పినా కూడా చెవిన పెట్టరు. అలా చేయడం వల్ల పార్క్‌కు నష్టమని తెలిసినా, జరిమానాలు వేసినా అస్సలు వినిపించుకోరు. అలా విచ్చలవిడిగా ప్రవర్తించే వారికి బుద్ధి చెప్పడానికి థాయ్‌లాండ్‌లో ‘ఖావో యై నేషనల్ పార్క్’ […]

Update: 2020-09-23 06:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఏదైనా పార్క్‌కు సరదాగా పిక్నిక్ వెళ్లినపుడు అక్కడ బాగా ఎంజాయ్ చేసి, తినేసి, తాగేసి ఇంటికి ఆనందంగా తిరిగొస్తారు. కానీ మీరు ఎంజాయ్ చేసిన ప్రదేశంలోనే ప్లాస్టిక్ కప్పులు, బాటిళ్లను వదిలేస్తారు. అలా చేయొద్దని పార్క్ అధికారులు ఎంత చెప్పినా కూడా చెవిన పెట్టరు. అలా చేయడం వల్ల పార్క్‌కు నష్టమని తెలిసినా, జరిమానాలు వేసినా అస్సలు వినిపించుకోరు. అలా విచ్చలవిడిగా ప్రవర్తించే వారికి బుద్ధి చెప్పడానికి థాయ్‌లాండ్‌లో ‘ఖావో యై నేషనల్ పార్క్’ అధికారులు ఓ వినూత్న విధానాన్ని ఎంచుకున్నారు. థాయ్‌లాండ్ పర్యావరణ శాఖ మంత్రి వరావుట్ సిల్పా అర్చా తన ఫేస్‌బుక్ పోస్టులో పేర్కొన్నట్లుగా పార్క్‌లో చెత్త వేసిన వారిని కనిపెట్టి, వాళ్ల ఇంటికే ఆ చెత్తను పోస్ట్ చేయాలని అధికారులు నిర్ణయించుకున్నారు.

యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడిన ఈ ‘ఖావో యై నేషనల్ పార్క్‌’లో ఇటీవల ఓ కుటుంబం పార్టీ చేసుకుని, వారు ఉపయోగించిన ప్లాస్టిక్ బాటిళ్లు, చిప్స్ ప్యాకెట్లను అక్కడే వదిలేసి వెళ్లారు. వాటిని పార్క్ సిబ్బంది పోగు చేసి, ఒక బ్యాగులో ప్యాక్ చేసి ఆ కుటుంబం అడ్రస్‌కు పంపించారు. ఆ పార్శిల్‌తో పాటు ‘మీరు పార్క్‌లో ఏదో మరిచిపోయారు’ అని లెటర్ రాసి కూడా పంపించారు. ఇలా చేయడం వల్ల అవమానపూరిత భావన కలిగి, పార్క్‌‌కు వచ్చేవారు తాము వేసిన చెత్తను తామే తీసుకెళ్తారని, లేదంటే అసలు చెత్త వేయడానికే సంకోచిస్తారని పార్క్ అధికారులు అన్నారు.

Tags:    

Similar News