నాడు చెప్పారు.. నేడు చేసి చూపిస్తున్నారు

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకే ప్రభుత్వం రైతు వేదికలను ఏర్పాటు చేసి మరింత చేయూతనిస్తోందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం అడవిమల్లెల గ్రామంలో రూ.22 లక్షలతో నిర్మించనున్న రైతు బంధు వేదిక నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ రైతులకు పుష్కలంగా నీళ్లు, రైతుబంధు సాయం, గిట్టుబాటు ధర […]

Update: 2020-07-21 02:12 GMT

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: రైతులను అన్ని విధాలుగా ఆదుకునేందుకే ప్రభుత్వం రైతు వేదికలను ఏర్పాటు చేసి మరింత చేయూతనిస్తోందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం అడవిమల్లెల గ్రామంలో రూ.22 లక్షలతో నిర్మించనున్న రైతు బంధు వేదిక నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గారితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయ‌న మాట్లాడుతూ రైతులకు పుష్కలంగా నీళ్లు, రైతుబంధు సాయం, గిట్టుబాటు ధర కల్పిస్తూ ప్రభుత్వం రైతు సంక్షేమానికి పాటుపడుతుందన్నారు. రైతును రాజును చేస్తానని తొలినాళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన విషయం గుర్తు చేశారు. నాడు చెప్పారు.. నేడు చేసి చూపిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సీతారామ ప్రాజెక్ట్ తో జిల్లా సస్యశ్యామలం కానున్నదని అన్నారు. అనంత‌రం సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం అడవి మల్లెల గ్రామంలోని లంకా సాగర్ చెరువు నుంచి సాగునీటిని దిగువకు వదిలారు.

తెలంగాణ రాష్ట్రంలో అరుదైన చరిత్ర ఆవిష్కృతం కాబోతున్నదని, ఈ వానాకాలం చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఆయకట్టుకు సాగునీరు అందించామన్నారు. అనంత‌రం సత్తుపల్లి నియోజకావర్గ కేంద్రంలోని సింగరేణి ఆధ్వర్యంలో జేవీఆర్ ఓపెన్ కాస్ట్ ఆవరణలోని 41 హెక్టర్లలో చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య , ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ , కలెక్టర్ కర్ణన్, అదనపు కలెక్టర్ స్నేహాలత , రైతు బంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి విజయ నిర్మల , డీసీఎంఎస్ చైర్మన్ శేషగిరిరావు, అధికారుకు, నాయకులు ఉన్నారు.

Tags:    

Similar News