సింగరేణి పర్సనల్ విభాగంలోని అధికారుల బదిలీలు
దిశ, బెల్లంపల్లి : సింగరేణి యాజమాన్యం పర్సనల్ విభాగంలోని 15 మంది అధికారులను బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇల్లందు ఏరియాలోని సిహెచ్. లక్ష్మీనారాయణను రామగుండం ఏరియా 1, కార్పొరేట్ విభాగంలోని రిక్రూట్మెంట్ సెల్ నుండి జి వి మోహన్ రావును ఇల్లందు ఏరియాలోని పర్సనల్ విభాగానికి, శ్రీరాంపూర్ ఏరియాలో రాజేశ్వర్‌ను శ్రీరాంపూర్‌లోని సూపర్ బజార్‌కు, శ్రీరాంపూర్ ఏరియాలోని సూపర్ బజార్ నుండి సుదర్శనంను శ్రీరాంపూర్ ఏరియా పర్సనల్ విభాగానికి, శ్రీరాంపూర్ డివిజన్‌లోని ఆర్కె […]
దిశ, బెల్లంపల్లి : సింగరేణి యాజమాన్యం పర్సనల్ విభాగంలోని 15 మంది అధికారులను బదిలీ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇల్లందు ఏరియాలోని సిహెచ్. లక్ష్మీనారాయణను రామగుండం ఏరియా 1, కార్పొరేట్ విభాగంలోని రిక్రూట్మెంట్ సెల్ నుండి జి వి మోహన్ రావును ఇల్లందు ఏరియాలోని పర్సనల్ విభాగానికి, శ్రీరాంపూర్ ఏరియాలో రాజేశ్వర్‌ను శ్రీరాంపూర్‌లోని సూపర్ బజార్‌కు, శ్రీరాంపూర్ ఏరియాలోని సూపర్ బజార్ నుండి సుదర్శనంను శ్రీరాంపూర్ ఏరియా పర్సనల్ విభాగానికి, శ్రీరాంపూర్ డివిజన్‌లోని ఆర్కె 5 ఇంక్లైన్ నుండి మట్టపర్తి రాజేష్‌ను శ్రీరాంపూర్ ఏరియాలోని పర్సనల్ విభాగానికి, శ్రీరాంపూర్ ఏరియాలోని ఇందారం 1A నుండి దేవేందర్ రెడ్డిని శ్రీరాంపూర్ గనుల గ్రూపు ఏజెంట్-1 పర్సనల్ అధికారిగా బదిలి చేశారు.
మందమర్రి ఏరియాలోని కాసిపేట దాని నుండి మైత్రేయ బందును మందమరి డివిజన్లోని పర్సనల్ విభాగానికి, బెల్లంపల్లి ఏరియాలోని డోర్లి ఓసి వన్ ప్రాజెక్టు నుండినాగుల వేణును భూపాల్ పల్లి ఏరియా పర్సనల్ విభాగానికి, రామగుండం 2 ఏరియాలోని ఓసి 3 ప్రాజెక్టు నుండి వేణుగోపాల్ రాజును రామగుండము 2 పర్సనల్ విభాగానికి, మందమర్రి ఏరియాలోని కేకే 1 నుండి ఎండి ఆసిఫ్ మందమరి ఏరియా పర్సనల్ విభాగానికి బదిలి చేశారు.
శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కె న్యూ టెక్ గని నుండి గుండు రాజును భూపాల్ పల్లి ఏరియా పర్సనల్ విభాగానికి, ఆండ్రియా గ్రూపు ప్రాజెక్టు ఏపీ ఏ నుండి నాగేశ్వరరావును రామగుండము 3 ఏరియా పర్సనల్ విభాగానికి, శ్రీరాంపూర్ ఏరియాలో న్యాయ విభాగం నుండి పి.కాంతారావును శ్రీరాంపూర్ పర్సనల్ విభాగానికి, భూపాలపల్లి ఏరియాలోని కేటీకే 8 ఇంక్లైన్ నుండి ఎండి మతీన్ హుస్సేన్‌ను భూపాలపల్లి ఏరియాలోని పర్సనల్ విభాగానికి బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. బదిలీ అయిన అధికారులు సంబంధిత ఏరియాలోని జనరల్ మేనేజర్ కార్యాలయాలలో రిపోర్టు చేసి విధుల్లో చేరాలని యాజమాన్యం ఉత్తర్వుల్లో పేర్కొంది.