కరీంనగర్‌లో కీలక పరిణామం.. పలువురు ఇన్‌స్పెక్టర్లు బదిలీ

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా వ్యవహారం, మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టా మధు అరెస్టులతో రాజకీయ కాక రేపుతోన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలువురు ఇన్‌స్పెక్టర్లు బదిలీ అయ్యారు. మంథని, ధర్మపురి, జమ్మికుంట రూరల్, జమ్మికుంట టౌన్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీసు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వారితో పాటు హుజూరాబాద్ ఇన్‌స్పెక్టర్లను సైతం బదిలీ […]

Update: 2021-05-09 00:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా వ్యవహారం, మంథని మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టా మధు అరెస్టులతో రాజకీయ కాక రేపుతోన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పలువురు ఇన్‌స్పెక్టర్లు బదిలీ అయ్యారు. మంథని, ధర్మపురి, జమ్మికుంట రూరల్, జమ్మికుంట టౌన్ ఇన్‌స్పెక్టర్లను బదిలీ చేస్తూ పోలీసు శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వారితో పాటు హుజూరాబాద్ ఇన్‌స్పెక్టర్లను సైతం బదిలీ చేశారు. అయితే.. ఈటల రాజేందర్, పుట్టా మధు రిఫరెన్స్‌తో పోస్టింగ్ పొందిన వారిని బదిలీ చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. కాగా, గతకొన్ని రోజులుగా అజ్ఞాతంలో ఉన్న పుట్టా మధును శనివారం ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో రామగుండం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆయనపై పలు అంశాలపై విచారణ జరుగుతుండగా, కరీంనగర్ జిల్లాలో పలువురు పోలీసు అధికారులు బదిలీ కావడం కలకలం రేపుతోంది.

Tags:    

Similar News