స్కిల్ డెవలప్మెంట్‌పై 10లక్షల మందికి శిక్షణ
దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో 10లక్షల మంది యువతకు స్కిల్ డెవలప్మెంట్‌పై శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ అకాడమి ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్), స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ మైక్రోసాఫ్ట్, నాస్కాం సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ‘మార్చ్ టు మిలియన్’ అనే కార్యక్రమాన్ని అమలు చేసేందుకు సంస్థల ప్రతినిధులు గురువారం సంతకాలు చేశారు. 2021వరకు ఈ మేరకు కార్యక్రమాన్ని పూర్తి చేసే లక్ష్య సాధన దిశగా అడుగులు వేయనున్నారు. ఈ సందర్భంగా ఐటీ, పరిశ్రమల […]
దిశ, తెలంగాణ బ్యూరో: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో 10లక్షల మంది యువతకు స్కిల్ డెవలప్మెంట్‌పై శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ అకాడమి ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్(టాస్క్), స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ మైక్రోసాఫ్ట్, నాస్కాం సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ‘మార్చ్ టు మిలియన్’ అనే కార్యక్రమాన్ని అమలు చేసేందుకు సంస్థల ప్రతినిధులు గురువారం సంతకాలు చేశారు. 2021వరకు ఈ మేరకు కార్యక్రమాన్ని పూర్తి చేసే లక్ష్య సాధన దిశగా అడుగులు వేయనున్నారు. ఈ సందర్భంగా ఐటీ, పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ మాట్లాడుతూ.. తెలంగాణ భవిష్యత్తు అవసరాల దృష్ట్యా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అమలుకు ముందుకొచ్చిన నాస్కాం, మైక్రోసాఫ్ట్ సంస్థలను అభినందించారు. సాంకేతిక విప్లవంలో విద్యార్ధులు భాగస్వాములు కావాలన్నారు. ప్రపంచ స్థాయి సంస్థల్లో పని చేయగల సామర్ధ్యం తెలంగాణ యువతకు రావాలని అభిలాషించారు.