ఇకనుంచి డీటీహెచ్ పోర్టబులిటీ!

దిశ, వెబ్‌డెస్క్: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సెట్-టాప్ బాక్సుల వినియోగదారులకు గుడ్‌న్యూస్ ప్రకటించింది. త్వరలో సెట్-టాప్ బాక్సులను మార్చకుండానే డీటీహెచ్ ఆపరేటర్లను మార్చుకునే విధంగా వెసులుబాటు కల్పించనుంది. దీనికి సంబంధించి శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. సెట్-టాప్ బాక్సులను ఒకరితో ఒకరు మార్చుకునేందుకు వీలుగా అవసరమైన చర్యలను చేపట్టాలని డీటీహెచ్ సంస్థలకు సూచనలు అందించింది. వినియోగదారులు ప్రస్తుతమున్న బాక్సులతోనే వేరే డీటీహెచ్ ఆపరేటర్లకు మార్చుకోవచ్చని, దీనికి అవసరమైన ప్రక్రియను అమలు పరచాలంటూ సమాచార, ప్రసార […]

Update: 2020-04-11 03:07 GMT
ఇకనుంచి డీటీహెచ్ పోర్టబులిటీ!
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా సెట్-టాప్ బాక్సుల వినియోగదారులకు గుడ్‌న్యూస్ ప్రకటించింది. త్వరలో సెట్-టాప్ బాక్సులను మార్చకుండానే డీటీహెచ్ ఆపరేటర్లను మార్చుకునే విధంగా వెసులుబాటు కల్పించనుంది. దీనికి సంబంధించి శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. సెట్-టాప్ బాక్సులను ఒకరితో ఒకరు మార్చుకునేందుకు వీలుగా అవసరమైన చర్యలను చేపట్టాలని డీటీహెచ్ సంస్థలకు సూచనలు అందించింది. వినియోగదారులు ప్రస్తుతమున్న బాక్సులతోనే వేరే డీటీహెచ్ ఆపరేటర్లకు మార్చుకోవచ్చని, దీనికి అవసరమైన ప్రక్రియను అమలు పరచాలంటూ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, ఎలక్ట్రానిక్స్ శాఖ, టీవీలను ఉత్పత్తి చేసే కంపెనీలతో ఓ కమిటీని నియమించాలని తెలిపింది. అలాగే, డిజిటల్ టీవీలన్నిటికీ కేబుల్, శాటిలైట్ సిగ్నళ్లు, యూఎస్‌బీ పోర్ట్ సపొర్ట్ చేసేలా ఉప్తత్తి చేయాలని సూచించింది.

Tags: TRAI, set top boxes, DTH, cable set-top-boxe

Tags:    

Similar News