HYD- విజయవాడ హైవేపై ఫుల్ ట్రాఫిక్ జామ్

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్, విజయవాడ రహదారిపై 4కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. గుండ్రంపల్లి రోడ్డు వద్ద లారీ బోల్తా పడింది. డివైడర్‌ను ఢీకొని రహదారి మధ్యలో లారీ పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయి వాహనదారులను ఇబ్బందులకు గురిచేశాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్‌ పునరుద్ధరణకు […]

Update: 2021-11-26 23:06 GMT
HYD- విజయవాడ హైవేపై ఫుల్ ట్రాఫిక్ జామ్
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్ : హైదరాబాద్, విజయవాడ రహదారిపై 4కి.మీ మేర వాహనాలు నిలిచిపోయాయి. నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. గుండ్రంపల్లి రోడ్డు వద్ద లారీ బోల్తా పడింది. డివైడర్‌ను ఢీకొని రహదారి మధ్యలో లారీ పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయి వాహనదారులను ఇబ్బందులకు గురిచేశాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్‌ పునరుద్ధరణకు చర్యలు ప్రారంభించారు.

Tags:    

Similar News