Pawan Kalyan: జనసేనానికి ప్రజాబలం.. గెలుపుకు ఇదే సాక్ష్యం..
ఆంధ్రప్రదేశ్‌లో మరో 24 గంటల్లో ఎన్నికలు జరగనున్నాయి.
దిశ వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో మరో 24 గంటల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గెలిచేదెవరు? అధికారాన్ని చేపట్టేదెవరు..? ఓడేది ఎవరు..? ఇంటి బాట పట్టేదెవరు..? అనే ఉత్కంఠ అటు ప్రజల్లోనూ, ఇటు రాజకీయ నేతల్లోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తారు అని రాజకీయ విశ్లేషకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
పవన్ ప్రస్తానం ఎలా మొదలైంది..?
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా సినీ పరిశ్రమకు పరిచయమైన పవన్ కళ్యాణ్ అతి కొద్ది కాలంలోనే పవర్‌స్టార్‌గా ఎదిగారు. అనంతరం తన సంపాదనను పేద ప్రజల కోసం కర్చు చేస్తూ.. ఆపదలో ఉన్నవాళ్ళను ఆదుకుంటూ మనసున్న మనిషగా ప్రజల మనసుల్లో నిలిచారు. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. కాగా గత ఎన్నికల్లో గాజువాక నుండి పోటి చేసి ఓటమిని చవిచూశారు. అయితే రేపు జరగనున్న ఎన్నికల్లో పవన్ కచ్చితంగా గెలుస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
పవన్‌కు ప్రజాధరణ ఉందని తెలిపే అంశాలు ఇవే..
ప్రస్తుతం చిన్న పిల్లవాడి నుండి పండు ముసలివాళ్ల వరకు పవన్ గెలుపును కోరుకుంటున్నారు అని చెప్పేందుకు పేద ప్రజల నుండి పార్టీకి వస్తున్న నిధులే సాక్ష్యం. ఒంటి మీద చొక్కా కూడా లేని కాకినాడకు చెందిన 13 ఏళ్ల కుర్రాడు 5 వేల రూపాయలు అన్నకు ఇవ్వండని పంపించారని, అలానే మొన్నీమధ్య 200 రూపాయలు మనీ ఆర్డర్ వచ్చిందని, ఓ పెద్దావిడ వితంతు పెన్షన్ కింద తనకు వచ్చే 15 వేల రూపాయలలో నుండి 5 వేలు ప్రతి నెల పార్టీకి పంపిస్తుందని పవన్ పేర్కొన్నారు.
అలానే మేము చేసిన తప్పు మీరు చేయకండి, పవన్‌ను గెలిపించమని గాజువాక వాసులు పిఠాపురం ప్రజలను కోరుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అలానే ప్రముఖ సర్వేసంస్థలు చేసిన సర్వేలో పవన్ గెలుస్తారని తేల్చి చెప్పారు. కనుక రేపు జరగనున్న ఎన్నికల్లో పవన్ గెలుపు తధ్యం అని విశ్లేషకులు భావిస్తున్నారు.