తగ్గనున్న చమురు ఉత్పత్తి.. ధరలు పెరుగుతాయా!
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి అంతర్జాతీయంగా వ్యాప్తి చెందుతున్న సందర్భంలో చమురు ఎగుమతి దేశాల సంస్థ ఒపెక్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. మే, జూన్ నెలల్లో చమురు ఉత్పత్తిని రోజుకు కోటి బ్యారెళ్ల వరకూ తగ్గించేందుకు నిర్ణయించాయి. దీనికి ఒపెక్‌లోని మెక్సికో మినహా అన్ని దేశాలు అంగీకారం తెలిపాయి. ఒపెక్, రష్యా సహా అన్ని దేశాలు వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించాయి. సుధీర్ఘంగా సాగిన ఈ కాన్ఫరెన్స్‌లో ఉత్పత్తిని తగ్గించి ధరలను అదుపులో ఉంచాలని నిర్ణయించాయి. ఇటీవల కరోనా […]
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 మహమ్మారి అంతర్జాతీయంగా వ్యాప్తి చెందుతున్న సందర్భంలో చమురు ఎగుమతి దేశాల సంస్థ ఒపెక్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. మే, జూన్ నెలల్లో చమురు ఉత్పత్తిని రోజుకు కోటి బ్యారెళ్ల వరకూ తగ్గించేందుకు నిర్ణయించాయి. దీనికి ఒపెక్‌లోని మెక్సికో మినహా అన్ని దేశాలు అంగీకారం తెలిపాయి. ఒపెక్, రష్యా సహా అన్ని దేశాలు వీడియో కాన్ఫరెన్స్‌ను నిర్వహించాయి. సుధీర్ఘంగా సాగిన ఈ కాన్ఫరెన్స్‌లో ఉత్పత్తిని తగ్గించి ధరలను అదుపులో ఉంచాలని నిర్ణయించాయి. ఇటీవల కరోనా ప్రభావంతో సౌదీ, రష్యా మధ్య చమురు యుద్ధం మొదలై ధరలు 20 ఏళ్ల కనిష్ఠానికి క్షీణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా వల్ల సరఫరా పూర్తీగా ఆగిపోవడంతో ఉత్పత్తిని తగ్గించి ధరలు అదుపులో ఉంచడమే శ్రేయస్కరమని భావించాయి. అయితే, ఈ నిర్ణయం తర్వాత మళ్లీ జూన్ 10న తదనంతర చర్యలపై నిర్ణయం తీసుకుంటామని ఇపెక్ స్పష్టం చేసింది.
రెండు నెలల క్రితం, అంతర్జాతీయంగా అన్ని దేశాలు లాక్‌డౌన్ పాటిస్తుండటంతో చమురుకు డిమాండ్ బాగా క్షీణించింది. ఉత్పత్తి తగ్గించాలని సౌదీ నిర్ణయాన్ని అప్పట్లో రష్యా అడ్డుపడింది. దీంతో రెండు దేశాల మధ్య చమురు యుద్ధం మొదలైంది. సౌదీ ఉత్పత్తిని పెంచి రష్యాను నిలువరించాలని భావించింది. ఈ పరిణామాలు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావాన్ని చూపించింది. ఈ వ్యవహారంలో అమెరికా అధ్యక్షుడు కల్పించుకుని రష్యాను ఒప్పందం కోసం ఒత్తిడి తెచ్చింది. దీంతో చమురు ఉత్పత్తి విషయంలో రష్యా ఒప్పుకుంది. ఈ ఒప్పందం ద్వారా మళ్లీ చమురు ధరలు పెరిగే అవకాశముంది.
Tags : Opec, Oil, Energy, soudi, russia