ఢిల్లీలో ఆగని హింస – సీబీఎస్ఈ పరీక్షల వాయిదా

ఢిల్లీలోని ఈశాన్య ప్రాంతంలో హింసాత్మక సంఘటనలు ఇంకా అదుపులోకి రాలేదు. పొరుగు జిల్లాలతో పాటు సుమారు 35 కంపెనీల పారామిలిటరీ బలగాలు రంగంలోకి దిగాయి. అయినా హింసను అదుపు చేయలేకపోతున్నారు. పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్న సీబీఎస్ఈ డైరెక్టర్ పదవ, పన్నెండవ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఉద్రిక్తత ఉన్న కొన్ని ప్రాంతాల్లో పోలీసులు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశారు. అలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని డీసీపీ ప్రకటించినా మరో పోలీసు ఉన్నతాధికారి మాత్రం […]

Update: 2020-02-25 11:03 GMT

ఢిల్లీలోని ఈశాన్య ప్రాంతంలో హింసాత్మక సంఘటనలు ఇంకా అదుపులోకి రాలేదు. పొరుగు జిల్లాలతో పాటు సుమారు 35 కంపెనీల పారామిలిటరీ బలగాలు రంగంలోకి దిగాయి. అయినా హింసను అదుపు చేయలేకపోతున్నారు. పరిస్థితిని దృష్టిలో పెట్టుకున్న సీబీఎస్ఈ డైరెక్టర్ పదవ, పన్నెండవ తరగతి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. మరోవైపు ఉద్రిక్తత ఉన్న కొన్ని ప్రాంతాల్లో పోలీసులు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశారు. అలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని డీసీపీ ప్రకటించినా మరో పోలీసు ఉన్నతాధికారి మాత్రం ఆ ఉత్తర్వులు అమల్లోనే ఉన్నాయని వ్యాఖ్యానించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు స్పెషల్ పోలీసు కమిషనర్‌గా 1985 బ్యాచ్ ఐపీఎస్ అధికారిని సీఆర్‌పీఎఫ్ నుంచి వెనక్కి రప్పించి ఢిల్లీ పోలీసు శాఖకు బదిలీ చేశారు. హోం మంత్రి అమిత్ షా బుధవారం కేరళ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ రెండు రోజుల హింసాత్మక సంఘటనల్లో ఇప్పటివరకు మొత్తం 13 మంది మృతి చెందినట్లు పోలీసు వర్గాలు ధృవీకరించాయి.

మరోవైపు జాతీయ మీడియా ప్రతినిధులపై జరిగిన హింసాత్మక చర్యలను భారత ప్రెస్ క్లబ్, మహిళా ప్రెస్ క్లబ్ నిర్వాహకులు ఖండించారు. సుమారు ఇరవై మంది పాత్రికేయులకు ఈ హింసలో గాయాలయ్యాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కార్యకలాపాల్లో బిజీగా ఉన్న ప్రధాని మోడీ ఇప్పటివరకు ఢిల్లీ హింసాత్మక సంఘటనలపై వ్యాఖ్యానించకపోవడాన్ని పలు రాజకీయ పార్టీలు తప్పుపట్టాయి. ఈశాన్య ఢిల్లీలోని పలు నివాస ప్రాంతాల్లో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.

Tags:    

Similar News