రేపటి నుంచి జుక్కల్‌లో జొన్నల కొనుగోలు
దిశ, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో మంగళవారం నుంచి జొన్నల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కలెక్టర్ శరత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో రైతులు తాము పండించిన జొన్నలను దళారులకు విక్రయించి మోసపోవద్దన్నారు. అలాగే ధాన్యం నిలువ చేయడానికి మార్కెట్ కమిటీ గోదాంలను వినియోగించుకోవాలని సూచించారు. అవి సరిపోకపోతే గ్రామాల్లోని ఫంక్షన్ హాళ్లు, పాఠశాల […]
దిశ, నిజామాబాద్: కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో మంగళవారం నుంచి జొన్నల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని కలెక్టర్ శరత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం ధాన్యం కొనుగోళ్లపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గంతోపాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో రైతులు తాము పండించిన జొన్నలను దళారులకు విక్రయించి మోసపోవద్దన్నారు. అలాగే ధాన్యం నిలువ చేయడానికి మార్కెట్ కమిటీ గోదాంలను వినియోగించుకోవాలని సూచించారు. అవి సరిపోకపోతే గ్రామాల్లోని ఫంక్షన్ హాళ్లు, పాఠశాల గదుల్లో ధాన్యం నిల్వ చేసుకోవచ్చని వివరించారు. వచ్చే ఖరీఫ్‌కు సరిపడా ఎరువులను అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా వ్యవసాయ అధికారి నాగేంద్రయ్యను కలెక్టర్ కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర మార్క్‌ఫెడ్ చైర్మన్ గంగారెడ్డి, అదనపు కలెక్టర్ యాదిరెడ్డి, డీసీవో మమత అధికారులు పాల్గొన్నారు.
tags : lockdown, kamareddy, jukkal, jowar purchase centers, collector sharath