ఫ్యాన్స్ పై స్టార్ హీరోయిన్ ఫైర్.. మరీ దిగజారకండంటూ..

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ అభిమానులపై ఫైర్ అయ్యింది. అలాంటి చీప్ పనులు చేసి దిగజారకండి  అంటూ అభిమానులకు సలహా ఇచ్చింది. ఇంతకీ నిధికి కోపం తెప్పించిన ఆ పని ఏంటంటే.. నిధి అగర్వాల్ అందాల ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఆ అమ్మడు హాట్ హాట్ ఫోటో షూట్లతో అభిమానులపై విరుచుకుపడుతుంది. ఈ నేపథ్యంలో తమ అభిమాన నటి ఫోటోలను […]

Update: 2021-07-16 04:20 GMT
nidhi agarwal news
  • whatsapp icon

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ అభిమానులపై ఫైర్ అయ్యింది. అలాంటి చీప్ పనులు చేసి దిగజారకండి అంటూ అభిమానులకు సలహా ఇచ్చింది. ఇంతకీ నిధికి కోపం తెప్పించిన ఆ పని ఏంటంటే.. నిధి అగర్వాల్ అందాల ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఆ అమ్మడు హాట్ హాట్ ఫోటో షూట్లతో అభిమానులపై విరుచుకుపడుతుంది. ఈ నేపథ్యంలో తమ అభిమాన నటి ఫోటోలను ఫ్యాన్స్ షేర్ చేస్తూ వైరల్ గా మార్చేస్తున్నారు. దీనికి సంబంధించి నిధి, ఫ్యాన్స్ కి వార్నింగ్ ఇచ్చింది.

“నాకు సంబంధించిన ఈ ఫోటో అవసరం లేకపోయినా కూడా ఎప్పుడూ సర్క్యులేట్ అవుతూనే ఉంది. నిజానికి దానికంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. నా అభిమానులలో ఎవ్వరైనా సరే తమ దృష్టికి అలాంటి ఫోటోలు వస్తే.. వాటిని షేర్ చేయకండి.. అది అనసరం. అలాంటివి చీప్ పనులే అవుతాయి. దిగజారకండి” అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. ఇంతకీ నిధికి అంత కోపం తెప్పించిన ఆ ఫోటో ఏంటి అనేది మాత్రం అమ్మడు చెప్పకపోయినా ఆ ఫోటో ఇదేనంటూ అభిమానులు ఇంకా వైరల్ చేస్తున్నారు. ఆ ఫొటోలో నిధి చీరకట్టులో ఎద అందాలను ఆరబోస్తూ కనిపించింది. ఇకపోతే ప్రస్తుతం నిధి అగర్వాల్ పవన్ కళ్యాణ్ సరసన ‘హరిహర వీరమల్లు’ లో, గల్లా జయదేవ్ ‘హీరో’ చిత్రంలో నటిస్తుంది.

Tags:    

Similar News