ధరణి సమస్యలు.. గాంధీభవన్‌లో టోల్ ఫ్రీ నెంబర్
దిశ, తెలంగాణ బ్యూరో: ధరణిలో ఎదురయ్యే సమస్యలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని టీపీసీసీ ధరణి కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహా ప్రకటించారు. రాజనర్సింహా ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. బాధితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, ప్రభుత్వం, ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని కమిటీ చైర్మన్ వెల్లడించారు. న్యాయ సహాయం, న్యాయ సలహాలు కూడా ఉచితంగా అందిస్తామన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ధరణి కమిటీ పర్యటిస్తుందని, రైతులు, బాధితులతో నేరుగా […]
దిశ, తెలంగాణ బ్యూరో: ధరణిలో ఎదురయ్యే సమస్యలపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని టీపీసీసీ ధరణి కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహా ప్రకటించారు. రాజనర్సింహా ఆధ్వర్యంలో గాంధీభవన్‌లో సోమవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పలు నిర్ణయాలు తీసుకున్నారు. బాధితులకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, ప్రభుత్వం, ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరిస్తామని కమిటీ చైర్మన్ వెల్లడించారు. న్యాయ సహాయం, న్యాయ సలహాలు కూడా ఉచితంగా అందిస్తామన్నారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ధరణి కమిటీ పర్యటిస్తుందని, రైతులు, బాధితులతో నేరుగా మాట్లాడుతామన్నారు. అదేవిధంగా ధరణి సమస్యలపై టోల్ ఫ్రీ నెంబర్లను ఏర్పాటు చేశామన్నారు. 040–24615602, 040–24601254 నెంబర్లకు కాల్ చేసి బాధితులు సమస్యలు చెప్పాలని కోరారు. ఈ సమావేశంలో కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.