నేడు నందికొట్కూరు ఎమ్మెల్యే ప్రెస్‌మీట్
కర్నూలు జిల్లా నందికొట్కూర్ నియోజకవర్గ రాజకీయం రంజుగా మారింది. నియోజకవర్గ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఎమ్మెల్యే ఆర్థర్ మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. పార్టీ కార్యకర్తలు కూడా బైరెడ్డి వర్గం, ఎమ్మెల్యే వర్గంగా చీలిపోయారు. దీంతో ఈ వ్యవహారం వైసీపీ అదిష్టానానికి తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం ఎమ్మెల్యే ఆర్థర్ ప్రెస్‌మీట్ పెట్టనున్నారు. దీంతో ఎమ్మెల్యే ఏ నిర్ణయం తీసుకుంటారోనని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. కాగా, ఇటీవల యువనేత […]
కర్నూలు జిల్లా నందికొట్కూర్ నియోజకవర్గ రాజకీయం రంజుగా మారింది. నియోజకవర్గ సమన్వయకర్త బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఎమ్మెల్యే ఆర్థర్ మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. పార్టీ కార్యకర్తలు కూడా బైరెడ్డి వర్గం, ఎమ్మెల్యే వర్గంగా చీలిపోయారు. దీంతో ఈ వ్యవహారం వైసీపీ అదిష్టానానికి తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం ఎమ్మెల్యే ఆర్థర్ ప్రెస్‌మీట్ పెట్టనున్నారు. దీంతో ఎమ్మెల్యే ఏ నిర్ణయం తీసుకుంటారోనని రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
కాగా, ఇటీవల యువనేత బైరెడ్డి సిద్ధార్థరెడ్డి ప్రతిపాదించిన వారికే వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని నియమించారని ఎమ్మెల్యే ఆర్థర్ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. గండ్రెడ్డి ప్రతాపరెడ్డి పేరును ఎమ్మెల్యే ప్రతిపాదించగా ఛైర్మన్ పదవి ఆయనకు దక్కలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తికి లోనై రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Tags: nandikotkur, mla, arthur, press meet, today