నేడు ప్రత్యేక ఆరోగ్య బృందాల పర్యటన
దిశ, మహబూబ్‌నగర్: నాగర్‌కర్నూలు జిల్లా కేంద్రంలో కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ఆదివారం ప్రత్యేక ఆరోగ్య బృందాలతో ఆరోగ్య వివరాలను సేకరించనున్నట్టు అదనపు కలెక్టర్ మనూ చౌదరి తెలిపారు. పట్టణంలో 8,190 కుటుంబాలు ఉన్నాయని, 36,951 మంది జనాభా ఉందన్నారు. ప్రత్యేక ఆరోగ్య బృందాలు పర్యటించి ఫీవర్ సర్వే చేస్తాయని, కరోనా వైరస్ విస్తరించకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఢిల్లీలో పర్యటించి వచ్చిన వారి కుటుంబ సభ్యులు క్వారంటైన్‌లో ఉండాలన్నారు. ఆరోగ్య బృందాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల […]
దిశ, మహబూబ్‌నగర్: నాగర్‌కర్నూలు జిల్లా కేంద్రంలో కరోనా పాజిటివ్ వచ్చిన నేపథ్యంలో ఆదివారం ప్రత్యేక ఆరోగ్య బృందాలతో ఆరోగ్య వివరాలను సేకరించనున్నట్టు అదనపు కలెక్టర్ మనూ చౌదరి తెలిపారు. పట్టణంలో 8,190 కుటుంబాలు ఉన్నాయని, 36,951 మంది జనాభా ఉందన్నారు. ప్రత్యేక ఆరోగ్య బృందాలు పర్యటించి ఫీవర్ సర్వే చేస్తాయని, కరోనా వైరస్ విస్తరించకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఢిల్లీలో పర్యటించి వచ్చిన వారి కుటుంబ సభ్యులు క్వారంటైన్‌లో ఉండాలన్నారు. ఆరోగ్య బృందాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. వారికి మాస్కులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డాక్టర్ సుధాకర్‌లాల్ పాల్గొన్నారు.
Tags: Today, tour, specialist health teams, mahabubnagar, joint collector