ఏపీలో ఒక్కరోజులో 443 కరోనా కేసులు

దిశ, ఏపీ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ క్రమేనా విజృంభిస్తోంది. ఏపీలో రోజురోజుకీ వందల సంఖ్యల్లో కేసులు నమోదు అవుతున్నాయి. వైరస్ వ్యాప్తితో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 443 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇందులో 392 మందికి స్థానికులు, 44 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు, మరో ఏడుగురు ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. […]

Update: 2020-06-22 06:18 GMT

దిశ, ఏపీ బ్యూరో: తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ క్రమేనా విజృంభిస్తోంది. ఏపీలో రోజురోజుకీ వందల సంఖ్యల్లో కేసులు నమోదు అవుతున్నాయి. వైరస్ వ్యాప్తితో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 443 కేసులు నమోదైనట్లు వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఇందులో 392 మందికి స్థానికులు, 44 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు, మరో ఏడుగురు ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. సోమవారం రాష్ట్రంలో వైరస్ బారిన పడి ఐదుగురు మృతి చెందినట్లు బులెటిన్‌లో ధృవీకరించారు. ఇప్పటివరకు 111 మంది వైరస్ కారణంగా మరణించారు. తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 9,372కు చేరింది. ప్రస్తుతం 4,862 మంది బాధితులు చికిత్స పొందుతుండగా.. వైరస్‌ను జయించి 4,435 మంది డిశ్చార్జి అయ్యారు.

Tags:    

Similar News