తెలంగాణలో 33 వేలు దాటిన కేసులు
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతూనే ఉంది. రోజుకీ వెయ్యికి పైగానే కేసులు నమోదు అవుతున్నాయే తప్ప తగ్గడం లేదు. శనివారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసేటప్పటకీ.. రాష్ట్రంలో 1,178 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 736 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో నమోదు కావడం గమనార్హం. కాగా, ఒక్క రోజులోనే వైరస్ కారణంగా 9 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 348కి చేరింది. ఇక తాజా కేసులతో రాష్ట్రంలో […]
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతూనే ఉంది. రోజుకీ వెయ్యికి పైగానే కేసులు నమోదు అవుతున్నాయే తప్ప తగ్గడం లేదు. శనివారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసేటప్పటకీ.. రాష్ట్రంలో 1,178 కేసులు నమోదు అయ్యాయి. ఇందులో 736 కేసులు జీహెచ్ఎంసీ పరిధిలో నమోదు కావడం గమనార్హం. కాగా, ఒక్క రోజులోనే వైరస్ కారణంగా 9 మంది మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 348కి చేరింది. ఇక తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా పాజిటివ్ సంఖ్య 33,402కు చేరింది. ఈ రోజు ఒక్క రోజే 1,714 మంది బాధితులు డిశ్చార్జి కాగా.. ఇప్పటివరకు 20,919 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 12,135 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా, గత రెండ్రోజులుగా కేసులు కాస్తా తగ్గుముఖం పట్టి.. డిశ్చార్జిల సంఖ్య పెరిగినట్టు బులెటిన్‌లో తెలుస్తోంది.