1,107కు చేరిన కరోనా కేసులు

జీహెచ్ఎంసీలో 11 నమోదు దిశ, న్యూస్‌బ్యూరో : తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య బుధవారం నాటికి 1,107కు చేరుకుంది. కొత్తగా బుధవారం జీహెచ్ఎంసీ పరిధిలో 11 కేసులు నమోదయ్యాయి. కాగా, ప్రస్తుతం 430 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. ఇప్పటివరకు డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లిపోయిన వారి సంఖ్య 648 కాగా.. బుధవారం ఒక్క రోజే 20 మంది డిశ్చార్జ్ అయ్యారు. గ్రేటర్‌లో నియంత్రణ చర్యలు.. […]

Update: 2020-05-06 11:36 GMT

జీహెచ్ఎంసీలో 11 నమోదు

దిశ, న్యూస్‌బ్యూరో :
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య బుధవారం నాటికి 1,107కు చేరుకుంది. కొత్తగా బుధవారం జీహెచ్ఎంసీ పరిధిలో 11 కేసులు నమోదయ్యాయి. కాగా, ప్రస్తుతం 430 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. ఇప్పటివరకు డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లిపోయిన వారి సంఖ్య 648 కాగా.. బుధవారం ఒక్క రోజే 20 మంది డిశ్చార్జ్ అయ్యారు.

గ్రేటర్‌లో నియంత్రణ చర్యలు..

కొత్తగా నమోదవుతున్న కేసులన్నీ గ్రేటర్ పరిధిలోనే ఉండటంతో అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం ఆదేశించారు. హైదరాబాద్ నగరంతో పాటు కర్నూలు, గుంటూరు సరిహద్దు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రెడ్‌జోన్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో కట్టుదిట్టమైన నియంత్రణ చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.

Tags: GHMC, lockdown, corona, KCR, Health, Telangana

Tags:    

Similar News