వడదెబ్బ నుంచి తప్పించుకోవాలంటే..

దిశ, వెబ్‌డెస్క్ : వేసవి వచ్చిందంటే ఎండతో ఉక్కిరిబిక్కిరి అవుతాం. ఇంట్లో ఉంటే ఉక్కపోత, బయటికి వెళ్తే వడదెబ్బతో ఇబ్బందులు పడుతుంటారు. మరీ ముఖ్యంగా బయట తిరిగే వారికి వడదెబ్బ కొట్టు ప్రమాదం ఉన్నది. ఇంట్లోనే ఉంటే కుటుంబం గడవదు కాబట్టి అలా ఇంటి నుంచి బయటకు వెళ్లే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సన్ స్ట్రోక్ నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో చూద్దాం.. వేసవికాలంలో ప్రతి ఒక్కరు ఏడు నుంచి ఎనిమిది లీటర్ల […]

Update: 2021-04-22 21:38 GMT

దిశ, వెబ్‌డెస్క్ : వేసవి వచ్చిందంటే ఎండతో ఉక్కిరిబిక్కిరి అవుతాం. ఇంట్లో ఉంటే ఉక్కపోత, బయటికి వెళ్తే వడదెబ్బతో ఇబ్బందులు పడుతుంటారు. మరీ ముఖ్యంగా బయట తిరిగే వారికి వడదెబ్బ కొట్టు ప్రమాదం ఉన్నది. ఇంట్లోనే ఉంటే కుటుంబం గడవదు కాబట్టి అలా ఇంటి నుంచి బయటకు వెళ్లే వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే సన్ స్ట్రోక్ నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవి ఏంటో చూద్దాం..

వేసవికాలంలో ప్రతి ఒక్కరు ఏడు నుంచి ఎనిమిది లీటర్ల మంచినీటిని తప్పక తాగాలి. కొంతమందికి తెల్లారి నుంచి నీరసంగా అనిపిస్తుంది. అలాంటి వారు తక్షణ శక్తినిచ్చే కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ, రాగి జావా తాగితే మంచింది. వేసవి సమయంలో త్వరగా జీర్ణమయ్యే ఆహారాన్నే తీసుకొవాలి. బిర్యాణీలు, వేపుళ్లకు దూరంగా ఉంటేనే బెటర్. శరీర వేడిని తగ్గించేందుకు సబ్జా గింజలను నానబెట్టుకుని తింటే చలవ చేస్తుంది. ఒక టీ స్పూన్ జీలకర్ర, ఖండ శక్కర (మిశ్రి ) నీటిలో కొద్ది గంటలపాటు నానబెట్టి మధ్యాహ్నం పూట తాగితే శరీరంలో ఉన్న అధిక వేడి తగ్గుతుంది. పొద్దున పూట కలబంద గుజ్జును సన్నగా తరుగుకుని దాంట్లో కొంచెం చక్కెర కలుపుకుని తినడం వల్ల కూడా శరీరంలో అధిక వేడి తగ్గుతుంది.

ఎండాకాలం అంటేనే ఉక్కపోత. ఈ ఉక్కపోత కారణంగా శరీరంపై చెమటకాయలు వస్తాయి. వీటిని గోర్లతో గిచ్చితే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉంది. చెమట పొక్కులు రాకుండా ఉండాలంటే కాటన్ వస్త్రాలు ధరించి శరీరానికి గాలి తగిలేలా జాగ్రత్తపడాలి. అలాగే బయటికి వెళ్లేటప్పుడు గొడుగు, మంచినీళ్ల బాటిల్ తీసుకెళ్లడం వచ్చిపోవద్దు. అలాగే తలకు టోపీ ధరించాలి. అత్యంత అవసరమైన పరిస్థితిల్లో తప్పించి బయట అడుగు పెట్టకూడదు.

Tags:    

Similar News