MLC వెంకట్రామి రెడ్డిని కలిసిన TNGO నాయకులు
దిశ, సిద్దిపేట : సిద్దిపేట జిల్లా మాజీ కలెక్టర్ ఎమ్మెల్సీ వెంకట్రామి రెడ్డిని సోమవారం సిద్దిపేట జిల్లా నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. వారిలో అధ్యక్షుడు గ్యాదారి పరమేశ్వర్, కార్యదర్శి కోమండ్ల విక్రమ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు నిమ్మ సురేందర్ రెడ్డి, సర్వేయర్లు అజీమ్ రామభద్రం ఉన్నారు. ఈ సందర్భంగా MLC వెంకట్రామి రెడ్డి మాట్లాడుతూ.. సిద్దిపేట ఉద్యోగులందరూ బాగా కష్టపడి పనిచేసి వారికి మంచి గుర్తింపు తీసుకురావాలన్నారు. దేశంలోనే సిద్దిపేట జిల్లాకు మంచి […]
దిశ, సిద్దిపేట : సిద్దిపేట జిల్లా మాజీ కలెక్టర్ ఎమ్మెల్సీ వెంకట్రామి రెడ్డిని సోమవారం సిద్దిపేట జిల్లా నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. వారిలో అధ్యక్షుడు గ్యాదారి పరమేశ్వర్, కార్యదర్శి కోమండ్ల విక్రమ్ రెడ్డి, ఉపాధ్యక్షుడు నిమ్మ సురేందర్ రెడ్డి, సర్వేయర్లు అజీమ్ రామభద్రం ఉన్నారు. ఈ సందర్భంగా MLC వెంకట్రామి రెడ్డి మాట్లాడుతూ.. సిద్దిపేట ఉద్యోగులందరూ బాగా కష్టపడి పనిచేసి వారికి మంచి గుర్తింపు తీసుకురావాలన్నారు. దేశంలోనే సిద్దిపేట జిల్లాకు మంచి గుర్తింపు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఇంత కాలం ఉద్యోగులందరూ తనకు చాలా సహకరించారని కొనియాడారు. అలాగే ఉద్యోగులంతా అధికారులకు సహకరించాలని కోరారు.