హర్యానా సరిహద్దులో రైతులపై టియర్ గ్యాస్
ఛండీగడ్ : రాజస్తాన్, హర్యానా సరిహద్దులో నూతన సాగు చట్టాకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కెనాన్‌లను ప్రయోగించారు. ఛలో ఢిల్లీ పిలుపులో భాగంగా దాదాపు మూడువారాల క్రితం రాజస్తాన్ నుంచి ఢిల్లీకి బయల్దేరిన రైతులను హర్యానా సరిహద్దులో పోలీసులు అడ్డుకున్నారు. అప్పటి నుంచి అక్కడే ధర్నా చేస్తున్నారు. సరిహద్దులోని షాహజహాన్‌పూర్ దగ్గర కొందరు రైతులు 25 ట్రాక్టర్‌లతో ఢిల్లీవైపునకు హర్యానాలోకి చొచ్చుకెళ్లడానికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డంగా పెట్టిన బారికేడ్లను ధ్వంసం […]
ఛండీగడ్ : రాజస్తాన్, హర్యానా సరిహద్దులో నూతన సాగు చట్టాకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులపై పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కెనాన్‌లను ప్రయోగించారు. ఛలో ఢిల్లీ పిలుపులో భాగంగా దాదాపు మూడువారాల క్రితం రాజస్తాన్ నుంచి ఢిల్లీకి బయల్దేరిన రైతులను హర్యానా సరిహద్దులో పోలీసులు అడ్డుకున్నారు. అప్పటి నుంచి అక్కడే ధర్నా చేస్తున్నారు. సరిహద్దులోని షాహజహాన్‌పూర్ దగ్గర కొందరు రైతులు 25 ట్రాక్టర్‌లతో ఢిల్లీవైపునకు హర్యానాలోకి చొచ్చుకెళ్లడానికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డంగా పెట్టిన బారికేడ్లను ధ్వంసం చేశారు.
హర్యానాలోకి ప్రవేశించారు. వీరిని అడ్డుకోవడానికి వాటర్ కెనాన్‌లను ప్రయోగించారని, టియర్ గ్యాస్‌నూ ఉపయోగించాల్సి వచ్చిందని, కానీ, ఇవి సదరు రైతులను అడ్డుకోలేకపోయాయని హర్యానా పోలీసులు తెలిపారు. అయితే, కొంతదూరం వెళ్లిన తర్వాత పోలీసులు వారిని అడ్డుకోగలిగారు. హర్యానా సరిహద్దులో తాము శాంతియుతంగా ధర్నా చేస్తున్నామని, కొందరు రైతులు వద్దన్నా వినకుండా సరిహద్దు దాటి వెళ్లారని కిసాన్ మహాపంచాయత్ అధ్యక్షుడు రాంపాల్ జాట్ తెలిపారు.