భయం గుప్పెట్లో టేకుపల్లి.. ఏ క్షణం ఏమి జరుగుతుందో..

దిశ,టేకులపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో రెండు రోజులుగా పెద్దపులి అలికిడి పెరిగింది. దాంతో ఏజేన్సీ గ్రామ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. శనివారం తెల్లవారుజామున మొట్లగూడెం జంగాలపల్లి ఫారెస్ట్ గేట్ వద్ద పెద్దపులి రొడ్డును క్రాస్ చేసింది. ఆదివారం టేకులపల్లి మండలంలోని కుంటల్ల సమీపంలోని అందుగులగూడెం వరిపోలల్లో పెద్దపులి పరుగెడుతుంటే కొందరు వాహనదారులు వీడియో తీశారు. అందుగులగూడెం నుంచి రోళ్ళపాడు అటవీ వైపు పులి వెళ్ళినట్లు సమాచారంతో ఫారెస్ట్ ఆఫీసర్లు పులి అడుగులను పరిశీలించారు. పరిసర […]

Update: 2021-11-21 07:33 GMT

దిశ,టేకులపల్లి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో రెండు రోజులుగా పెద్దపులి అలికిడి పెరిగింది. దాంతో ఏజేన్సీ గ్రామ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. శనివారం తెల్లవారుజామున మొట్లగూడెం జంగాలపల్లి ఫారెస్ట్ గేట్ వద్ద పెద్దపులి రొడ్డును క్రాస్ చేసింది. ఆదివారం టేకులపల్లి మండలంలోని కుంటల్ల సమీపంలోని అందుగులగూడెం వరిపోలల్లో పెద్దపులి పరుగెడుతుంటే కొందరు వాహనదారులు వీడియో తీశారు.

అందుగులగూడెం నుంచి రోళ్ళపాడు అటవీ వైపు పులి వెళ్ళినట్లు సమాచారంతో ఫారెస్ట్ ఆఫీసర్లు పులి అడుగులను పరిశీలించారు. పరిసర గ్రామ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇందులో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ముక్తార్ హుస్సెన్ డిఫ్టిటి ఎఫ్ఆర్ బీ కృష్ణ, బీట్ఆఫీసర్లు మోహన్, భద్రయ్య, పాల్లొన్నారు.

Tags:    

Similar News