రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక ఆ బాధ తొలగినట్లే..!

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ఈనెల 19(సోమవారం) నుంచి రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు టికెట్లు ఇవ్వనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా ఉధృతి తగ్గడంతో 82 ప్రత్యేక రైళ్లను పునరుద్ధరించినట్లు వెల్లడించారు. ఇందులో 16 ఎక్స్‌ప్రెస్, 66 ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయని, నేటి నుంచి కొత్త నెంబర్లతో ప్యాసింజర్ రైళ్లు పట్టాలెక్కుతాయని అన్నారు. ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణానికి స్టేషన్‌లోనే […]

Update: 2021-07-18 21:20 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ఈనెల 19(సోమవారం) నుంచి రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు టికెట్లు ఇవ్వనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా ఉధృతి తగ్గడంతో 82 ప్రత్యేక రైళ్లను పునరుద్ధరించినట్లు వెల్లడించారు. ఇందులో 16 ఎక్స్‌ప్రెస్, 66 ప్యాసింజర్ రైళ్లు ఉన్నాయని, నేటి నుంచి కొత్త నెంబర్లతో ప్యాసింజర్ రైళ్లు పట్టాలెక్కుతాయని అన్నారు. ప్యాసింజర్ రైళ్లలో ప్రయాణానికి స్టేషన్‌లోనే టికెట్లు ఇస్తారని, ప్రయాణికులు మాస్కులు, భౌతిక దూరం లాంటి కరోనా నిబంధనలు విధిగా పాటించాలన్నారు. కరోనా నేపథ్యంలో రైల్వే స్టేషన్లతో పాటు పరిసరాలను శానిటైజేషన్ చేస్తున్నామని వెల్లడించారు.

Tags:    

Similar News