గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌కు ఇండియన్ సినిమాలు

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవలే ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌కు ఎంపికైన చిత్రాల జాబితా విడుదల కాగా, అందులో ఇండియా నుంచి పది సినిమాలు ‘బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్’ నామినేషన్స్‌లో స్థానం దక్కించుకున్నాయి. అంతేకాదు ఈ పదింటిలో మూడు సౌత్ ఇండియన్ సినిమాలే ఉండటం విశేషం. ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరీలో ఓ సినిమా క్వాలిఫై అవ్వాలంటే, ఆయా దేశాల్లో అవార్డు ఎంపిక (అక్టోబర్ 1- డిసెంబర్ 31)కు కనీసం 15 నెలల ముందే సినిమా విడుదలై ఉండాలి. […]

Update: 2020-12-21 03:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవలే ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌కు ఎంపికైన చిత్రాల జాబితా విడుదల కాగా, అందులో ఇండియా నుంచి పది సినిమాలు ‘బెస్ట్ ఫారిన్ లాంగ్వేజ్’ నామినేషన్స్‌లో స్థానం దక్కించుకున్నాయి. అంతేకాదు ఈ పదింటిలో మూడు సౌత్ ఇండియన్ సినిమాలే ఉండటం విశేషం. ఫారిన్ లాంగ్వేజ్ ఫిల్మ్ కేటగిరీలో ఓ సినిమా క్వాలిఫై అవ్వాలంటే, ఆయా దేశాల్లో అవార్డు ఎంపిక (అక్టోబర్ 1- డిసెంబర్ 31)కు కనీసం 15 నెలల ముందే సినిమా విడుదలై ఉండాలి. కానీ ఈ సారి పాండమిక్ పరిస్థితుల కారణంగా క్వాలిఫికేషన్ రూల్స్‌లో చాలా మార్పులు జరిగాయి.

78వ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్‌లో భాగంగా ఇండియా నుంచి ‘తానాజీ, లూడో, ద డిసైపుల్, ఎబ్అల్లాయ్ వూ, హరామి, జస్ట్‌ లైక్‌ దట్, ట్రీస్‌ అండర్ ది సన్’ చిత్రాలు ఫారిన్ లాంగ్వేజ్ లిస్ట్‌కు ఎంపిక కాగా.. దక్షిణాది నుంచి ‘అసురన్, సూరరై పోట్రు, జల్లికట్టు’ చిత్రాలు ఎంపికయ్యాయి. వచ్చే ఏడాది జనవరిలో లాస్ ఏంజెల్స్‌లో ఈ అవార్డు ప్రదానోత్సవం జరుగనుండగా, విదేశీ భాషా చిత్ర విభాగంలో ఈ చిత్రాలను ప్రదర్శించనున్నారు.

సుధ కొంగర ప్రసాద్ దర్శకత్వంలో సూర్య హీరోగా తెరకెక్కిన ‘సూరారై పోట్రు’ ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జీఆర్ గోపీనాథ్ జీవితం ఆధారంగా రూపొందించిన విషయం తెలిసిందే. ఇక జాతీయ అవార్డు దర్శకుడు వెట్రిమారన్ దర్శకత్వంలో.. ధనుష్ లీడ్ రోల్ పోషించిన ‘అసురున్’ చిత్రం పూమాని నవల ‘వెక్కై’ ఆధారంగా రూపొంది విజయాన్ని సొంతం చేసుకుంది. లిజో జోస్ పెల్లిస్సేరీ తెరకెక్కించిన ఆస్కార్ నామినేటెడ్ మలయాళ చిత్రం ‘జల్లికట్టు’ కూడా గోల్డెన్ గ్లోబ్ అవార్డుతో పాటు అనేక అంతర్జాతీయ వేదికలపైనా విమర్శకుల ప్రశంసలందుకుంది. కాగా ఎస్.హరీష్ రాసిన ‘మావోయిస్టు’ అనే కథ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

Tags:    

Similar News

Sharvari

Ishita Raj Sharma