పరీక్షల్లో ఫెయిలయ్యామని.. ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్య

దిశ, ఏపీ బ్యూరో: ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలయ్యామన్న మనస్తాపంతో వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం గ్రామానికి చెందిన కీర్తి ఇంటర్ ఫెయిల్ కావడంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మరో ఘటనలో పిడుగురాళ్ల మండలంలోని జూలకల్లుకు చెందిన స్నేహలత కూడా ఇదే కారణంతో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఇంకో ఘటనలో తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన సాయిబాబా ఇంటర్ […]

Update: 2020-06-15 02:39 GMT
  • whatsapp icon

దిశ, ఏపీ బ్యూరో: ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలయ్యామన్న మనస్తాపంతో వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రాష్ట్రంలో కలకలం రేపింది.

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం మల్లవరం గ్రామానికి చెందిన కీర్తి ఇంటర్ ఫెయిల్ కావడంతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మరో ఘటనలో పిడుగురాళ్ల మండలంలోని జూలకల్లుకు చెందిన స్నేహలత కూడా ఇదే కారణంతో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది.

ఇంకో ఘటనలో తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన సాయిబాబా ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంటి నుంచి వెళ్లిపోయాడు.అనంతరం గోదావరి నదిలో విగతజీవిగా తేలాడు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు గుండెలవిసేలా కన్నీరు పెడుతున్నారు. ఈ ఘటనలపై ఆయా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తు చేపట్టారు.

Tags:    

Similar News