రాహుల్ హత్య కేసులో కీలక మలుపు.. కారులోనే ఉరేసి..!
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని విజయవాడలో గురువారం ఉదయం ఆగి ఉన్న కారులో మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. తొలుత అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు విచారణ అనంతరం హత్యగా నిర్దారించారు. జడ్‌ఎక్స్‌ఎన్ సిలిండర్ల కంపెనీ యజమాని, తాడిగడపకు చెందిన రాహుల్‌ను ముగ్గురు వ్యక్తులు హత్య చేసినట్లు విచారణలో తేలింది. రాత్రి కారులో మూడు గంటల పాటు ఇరు వర్గాలకు మధ్య ఘర్షణ జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. అంతేకాకుండా కారులో మరికొన్ని కీలక ఆధారాలు సేకరించారు. […]
దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలోని విజయవాడలో గురువారం ఉదయం ఆగి ఉన్న కారులో మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. తొలుత అనుమానాస్పద మృతిగా భావించిన పోలీసులు విచారణ అనంతరం హత్యగా నిర్దారించారు. జడ్‌ఎక్స్‌ఎన్ సిలిండర్ల కంపెనీ యజమాని, తాడిగడపకు చెందిన రాహుల్‌ను ముగ్గురు వ్యక్తులు హత్య చేసినట్లు విచారణలో తేలింది. రాత్రి కారులో మూడు గంటల పాటు ఇరు వర్గాలకు మధ్య ఘర్షణ జరిగినట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్దారించారు. అంతేకాకుండా కారులో మరికొన్ని కీలక ఆధారాలు సేకరించారు.
ముందు సీట్లో లభించిన ప్లాస్టిక్ తాడును రాహుల్ మెడకు బిగించి ఆ తర్వాత దిండును తలపై ఉంచి ఊపిరాడకుండా హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన ఓ అభ్యర్థి హస్తం ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతుండగా, నిందితుల కోసం ఐదు బృందాలు ప్రత్యేకంగా గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా, ఆర్థిక వ్యవహారాలు లేదా పాత కక్ష్యల నేపథ్యంలోనే హత్య జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.