బస్సులో ప్రయాణిస్తున్నారా.. టీకా తప్పనిసరి.. ఎక్కడో తెలుసా.?
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా థర్డ్ వేవ్‌ను దృష్టిలో ఉంచుకొని థానే మున్సిపల్ కార్పొరేషన్ కొత్త ఆంక్షలు విధించింది. టీకాలు వేయించుకోని ప్యాసింజర్స్.. పబ్లిక్ బస్సులలో ప్రయాణించేందుకు నిరాకరించింది. ఈ మేరకు నగర మేయర్ నరేష్ మాస్కే శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరుకు ఒక్క డోస్ వ్యాక్సిన్ కూడా తీసుకోని ఉద్యోగులకు జీతాలు చెల్లించబోమని థానే పౌరసరఫరాల సంస్థ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో థానే మేయర్ మాట్లాడుతూ.. నవంబర్ […]
దిశ, వెబ్‌డెస్క్ : కరోనా థర్డ్ వేవ్‌ను దృష్టిలో ఉంచుకొని థానే మున్సిపల్ కార్పొరేషన్ కొత్త ఆంక్షలు విధించింది. టీకాలు వేయించుకోని ప్యాసింజర్స్.. పబ్లిక్ బస్సులలో ప్రయాణించేందుకు నిరాకరించింది. ఈ మేరకు నగర మేయర్ నరేష్ మాస్కే శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరుకు ఒక్క డోస్ వ్యాక్సిన్ కూడా తీసుకోని ఉద్యోగులకు జీతాలు చెల్లించబోమని థానే పౌరసరఫరాల సంస్థ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో థానే మేయర్ మాట్లాడుతూ.. నవంబర్ చివరి నాటికి వంద శాతం టీకా లక్ష్యాన్ని సాధించడానికి, కొన్ని కఠిన ఆంక్షలు తప్పనిసరి అని వివరణ ఇచ్చారు. పబ్లిక్ బస్సులలో ప్రయాణించే వారు టీకా సర్టిఫికెట్ లేదా యూనివర్సల్ ట్రావెల్ పాస్‌ను వారి వెంట ఉంచుకోవాలని సూచించారు. లేని పక్షంలో వారు బస్సుల్లో ప్రయాణించడానికి వీలులేదని తెలిపారు.
అయితే ప్రస్తుతం థానేలో కొవిడ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతున్న కారణంగా మున్సిపాలిటీ పరిధిలో ఉన్న రెండు కొవిడ్ ఆసుపత్రులను మూసివేస్తు్న్నట్టు తెలిపారు. ఈ క్రమంలోనే ఎవరైతే ఇప్పటి వరకు టీకా తీసుకోలేదో వారు వెంటనే వాక్సినేషన్ కేంద్రాలకు వెళ్లి టీకా తీసుకోవాలని అన్నారు.