మానకొండూరులో ప్రస్తుత డిమాండ్ ఇదే!

దిశ, మానకొండూరు: మానకొండూరు నియోజకవర్గంలో రహదారులు కోతకు గురికావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పక్కనే ఉన్న గ్రామానికి వెళ్లాలంటే 30 కిలో మీటర్ల దూరం తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రం నుండి సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలం బేగంపేట, లక్ష్మీపూర్, గూడెం గ్రామాలకు మధ్యన గల రోడ్డు ఇటీవల కురసిన వర్షాలకు ఇలా కోతకు గురైంది. దీంతో ఇల్లంతకు, బేగంపేట గ్రామానికి రాకపోకలు పూర్తిగా […]

Update: 2020-07-27 21:54 GMT

దిశ, మానకొండూరు: మానకొండూరు నియోజకవర్గంలో రహదారులు కోతకు గురికావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పక్కనే ఉన్న గ్రామానికి వెళ్లాలంటే 30 కిలో మీటర్ల దూరం తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కేంద్రం నుండి సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలం బేగంపేట, లక్ష్మీపూర్, గూడెం గ్రామాలకు మధ్యన గల రోడ్డు ఇటీవల కురసిన వర్షాలకు ఇలా కోతకు గురైంది.

దీంతో ఇల్లంతకు, బేగంపేట గ్రామానికి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. నిత్యం వందలాది మంది తిరిగే ఈ రోడ్డు కోతకు గురికావడంతో 30 కిలో మీటర్ల దూరం తిరిగి వెళ్లాల్సి వస్తోందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదనతో తెలిపారు. అధికారులు చొరవ తీసుకుని కోతకు గురైన రోడ్డును వెంటనే బాగు చేయించాలని కోరుతున్నారు. ఈ సమస్య తిరిగి ఎదురు కాకుండా ఉండేందుకు శాశ్వతమైన పరిష్కారం కనుగొనాలని ఆ ప్రాంత వాసులు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News