ముద్దు ఎందుకు పెట్టుకుంటారు? దాన్ని ఎవరు కనిపెట్టారు?
దిశ,వెబ్‌డెస్క్: మన పురాణాల ప్రకారం.. మన్మథుడికి లోకాలన్నిటినీ ఆకర్షించే శక్తి ఉంది. అలాంటి మన్మథుడిని సైతం కట్టిపడేసే ఆకర్షణ రతీదేవిది. వాళ్లిద్దరూ వివాహం అనంతరం ఏకాంత సమయంలో ప్రత్యేకంగా ఉన్న తియ్యటి ఫలాన్ని రుచి చూస్తూ ఆ అద్భుతమైన తీయదనాన్ని ఆస్వాదిస్తుండే వారు. ఇంత తీపిని మనమేకాదు… మానవులక్కూడా పంచుదామా స్వామీ అని మన్మథుడిని అడిగిందట రతిదేవి. అలాగే దేవి, కానీ ఫలరూపంలో కాదన్నాడట మన్మథుడు. దీంతో రతీదేవి ఎలా మరి? అని అడిగితే.. అందుకు మన్మథుడు […]
దిశ,వెబ్‌డెస్క్: మన పురాణాల ప్రకారం.. మన్మథుడికి లోకాలన్నిటినీ ఆకర్షించే శక్తి ఉంది. అలాంటి మన్మథుడిని సైతం కట్టిపడేసే ఆకర్షణ రతీదేవిది. వాళ్లిద్దరూ వివాహం అనంతరం ఏకాంత సమయంలో ప్రత్యేకంగా ఉన్న తియ్యటి ఫలాన్ని రుచి చూస్తూ ఆ అద్భుతమైన తీయదనాన్ని ఆస్వాదిస్తుండే వారు. ఇంత తీపిని మనమేకాదు… మానవులక్కూడా పంచుదామా స్వామీ అని మన్మథుడిని అడిగిందట రతిదేవి. అలాగే దేవి, కానీ ఫలరూపంలో కాదన్నాడట మన్మథుడు. దీంతో రతీదేవి ఎలా మరి? అని అడిగితే.. అందుకు మన్మథుడు సమాధానమిస్తూ ముద్దు రూపంలో అన్నాడట. అందుకే ముద్దు మన్మథుని మొదటి అస్త్రం. మరి అలాంటి ముద్దు గురించి కొన్ని రహస్యాలు తెలుసుకుందాం.
1. ముద్దులో 80 మిలియన్ల బ్యాక్టీరియా
అదర చుంబనంలో పాల్గొనే సమయంలో 80మిలియన్ బ్యాక్టీరియా కణాలు ఒకరి నుంచి ఒకరికి ట్రాన్స్ ఫర్ అవుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. 2014లో సైంటిస్టులు జరిపిన అధ్యయనంలో లిప్ లాక్ వల్ల బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తున్నట్లు మైక్రోబయోమ్ జర్నల్ లో ప్రచురించారు.
2. ముద్దు వల్ల భయం వద్దు
సినిమాలో లిప్ లాక్ సీన్లు చూస్తే ఎవరైనా సరే.. అరె! వీళ్లేంటి ఇలా ముద్దు పెట్టుకుంటున్నారు. వీళ్లకి ఎలాంటి అనారోగ్య సమస్యలు రావా అనే డౌట్ రావొచ్చు. ముద్దు పెట్టుకునే సమయంలో 80 మిలియన్‌ల బాక్టీరియా బదిలీ అవుతుందనేది వాస్తవం. కానీ ముద్దు కంటే చేతుల నుంచి వ్యాప్తి చెందే బ్యాక్టీరియా వల్లే అనారోగ్యానికి గురికావాల్సి ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
3. పెదవులకు ముద్దంటే ఇష్టమా
నిజమే..! మన పెదవులు ముద్దు పెట్టేందుకు ఇష్టపడతాయని డాక్టర్లు చెబుతున్నారు. వైద్య పరిభాషలో మన మెదడులో ఉండే కార్టెక్స్ అనే ప్రాంతం కొన్ని రసాయనాల్ని విడుదల చేసి ముద్దు పెట్టేలా మన పెదవుల్ని ప్రేరేపిస్తుందని తేలింది. అలా ప్రేరేపించి కోరికల్ని రేకెత్తించే(ఎరోజెనస్ జోన్) శరీర భాగాల్ని కలవరానికి గురిచేస్తాయి.
4. ముద్దుతో రిలాక్స్
ఇటీవల అమెరికాలోని పెన్సిల్వేనియాకు చెందిన లాఫాయెట్ యూనివర్సిటీ జరిపిన అధ్యయనం ప్రకారం ఒత్తిడిలో ఉన్నప్పుడు కార్టిసాల్ హార్మోన్ ల విడుదల స్థాయి తగ్గిపోతుంది. అయితే ఒత్తిడిలో ఉన్నప్పుడు ముద్దు పెట్టుకుంటే.., స్ట్రెస్ నుంచి రిలాక్స్ అవ్వచ్చని లాఫాయెట్ సైంటిస్టులు చెబుతున్నారు.
5. బంధాన్ని దృఢం చేస్తుందా?
అదే లాఫాయెట్ యూనివర్సిటీ జరిపిన అధ్యయనంలో ముద్దు వల్ల భార్య-భర్తల బంధం దృఢంగా ఉంటున్నట్లు సైంటిస్టులు నిర్ధారించారు. దంపతులు ముద్దు పెట్టుకునే సమయంలో ప్రేమ, ప్రతిస్పందనలు కలిగించే ఆక్సిటోసిన్ అనే హార్మోన్లను విడుదల చేస్తాయని, ఆ హార్మోన్ల వల్ల బంధం మరింత దృఢంగా తయారవుతున్నట్లు లాఫాయెట్ సైంటిస్టులు నిర్ధారించారు.
6. ముద్దు అనేది సమస్త మానవాళికి సంబంధించిన అంశం
ముద్దు అనేది సమస్త మానవాళికి సంబంధించిన అంశమని ‘ది సైన్స్ ఆఫ్ కిస్సింగ్: వాట్ అవర్ లిప్స్ ఆర్ టెల్లింగ్ అజ్’ పుస్తక రచయిత షెరిల్ కిర్షెన్‌బామ్ తెలిపారు. షెరిల్ తెలిపిన వివరాల ప్రకారం 90కంటే ఎక్కువ శాతం సంస్కృతుల్లో ముద్దు పెట్టుకునే సంప్రదాయం ఉంది. ఎందుకంటే తల్లిదండ్రులు – పిల్లలు, భార్య – భర్త బంధం ఎక్కువ కాలం కొనసాగేందుకేనని చెప్పారు.
7. ముద్దు ముద్దుగా ఉండటం లేదంట
ఇటీవల యూనివర్శిటీ ఆఫ్ టెక్సాస్ అధ్యయనంలో, 66% మంది మహిళలు మరియు 59% మంది పురుషులు కొత్త శృంగార కాంక్షలకు దూరంగా ఉంటున్నారు. ఎందుకంటే ముద్దు ముద్దుగా లేదంట.
8. సరైన పార్ట్‌నర్‌ను ఎంచుకోవచ్చా?
సరైన పార్ట్‌నర్‌ను ఎంపిక చేసుకునేందుకు ముద్దు దోహదం చేస్తుందని ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది. అప్పుడే పెళ్లైన జంటలపై జరిపిన అధ్యయనంలో ముద్దు వల్ల తమకు సరైన భాగస్వామిని ఎంచుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
9. స్లోపీ కిస్సెస్ అంటే ఇష్టం
సైన్స్ ప్రకారం పురుషులకు స్లోపీ కిస్సెస్ అంటేనే ఇష్టం. ఆరోగ్యానికి, సెక్సువాలిటీపై ప్రభావాన్ని చూపే టెస్టోస్టెరాన్ అనే హార్మోన్లు స్త్రీలలో కంటే పురుషుల్లో 40 నుండి 60 సార్లు కంటే ఎక్కువ ఉత్పత్తి అవుతాయి. ఆ హార్మోన్లే లాలాజలంలో ఉంటాయి. అందుకే పురుషులు స్లోపీ కిస్ చేసేందుకు ఇష్టపడతారని
రట్జర్స్ యూనివర్సిటీకి చెందిన బయోలాజికల్ ఆంత్రోపాలజిస్ట్ హెలెన్ ఫిషర్ తెలిపారు.