చోరీ చేసే ముందు అమ్మవారికి మొక్కుకున్న దొంగ.. సీసీ టీవీలో రికార్డ్

దిశ, వెబ్ డెస్క్: ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన దొంగతానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. జిల్లా కేంద్రంలోని 4వ డివిజన్ లో ఉన్న అంకమ్మ ఆలయంలో ఈ మధ్యే చోరీ జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఆలయంలోకి ప్రవేశించి హుండీని పగులగొట్టి అందులో ఉన్న నగదును దొంగిలించాడు ఓ దొంగ. అయితే, చోరీ చేయడానికి ముందు ఆ దొంగ అమ్మవారికి నమస్కరించాడు. ఆ తర్వాత హుండీని పగులగొట్టి నగదును ఎత్తుకెళ్లాడు. ఇదంతా కూడా సీసీ […]

Update: 2021-11-03 23:50 GMT

దిశ, వెబ్ డెస్క్: ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన దొంగతానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. జిల్లా కేంద్రంలోని 4వ డివిజన్ లో ఉన్న అంకమ్మ ఆలయంలో ఈ మధ్యే చోరీ జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఆలయంలోకి ప్రవేశించి హుండీని పగులగొట్టి అందులో ఉన్న నగదును దొంగిలించాడు ఓ దొంగ. అయితే, చోరీ చేయడానికి ముందు ఆ దొంగ అమ్మవారికి నమస్కరించాడు. ఆ తర్వాత హుండీని పగులగొట్టి నగదును ఎత్తుకెళ్లాడు. ఇదంతా కూడా సీసీ టీవీలో రికార్డయ్యిందని, దీని ఆధారంగా ఆలయ కమిటీ చైర్మన్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే, ఈ దృశ్యాలను చూసిన నెటిజన్లు వైరల్ చేస్తూ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు. మనం ఏదైనా పనిని ప్రారంభించేటప్పుడు ఆ పని బాగా జరగాలని మొదటగా దేవుళ్లకు మొక్కుతుంటాం.. ఇక్కడ కూడా ఈ దొంగ కూడా ఆ ఆనవాయితీనే బాగా పాటించాడుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

కాబోయే భర్తే కదా.. నగ్న ఫోటోలు, న్యూడ్ వీడియో కాల్స్.. చివరకు ఏమైందంటే.?

Tags:    

Similar News