'రాఖీ- ఖాకీ'.. ఒకే ప్రాసలో ఎందుకుంటాయో తెలుసా..?

దిశ, తెలంగాణ బ్యూరో:  అన్నా చెల్లెల్ల బంధానికి ప్రతీకగా రక్షాభంధన్ జరుపుకుంటారు. ‘నాకు నువ్వు రక్ష- నీకు నేను రక్ష’ అని చెప్పుకొని రాఖీని కట్టుకుంటారు. ఇది అందరికీ తెలిసిందే .. అయితే రాఖీ- ఖాకీ ప్రాస ఒకేలా ఎందుకు ఉన్నాయో మీకు తెలుసా? ముంబయి పోలీసులు దీన్ని నిర్వచిస్తూ రాఖీ సందర్భంగా సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. రాఖీ అంటే సోదరీమణుల రక్షణ సోదరుడి బాధ్యత అని.. పోలీసులుగా ” మీ భద్రతే మా […]

Update: 2021-08-22 02:12 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అన్నా చెల్లెల్ల బంధానికి ప్రతీకగా రక్షాభంధన్ జరుపుకుంటారు. ‘నాకు నువ్వు రక్ష- నీకు నేను రక్ష’ అని చెప్పుకొని రాఖీని కట్టుకుంటారు. ఇది అందరికీ తెలిసిందే .. అయితే రాఖీ- ఖాకీ ప్రాస ఒకేలా ఎందుకు ఉన్నాయో మీకు తెలుసా?

ముంబయి పోలీసులు దీన్ని నిర్వచిస్తూ రాఖీ సందర్భంగా సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. రాఖీ అంటే సోదరీమణుల రక్షణ సోదరుడి బాధ్యత అని.. పోలీసులుగా ” మీ భద్రతే మా ప్రధాన కర్తవ్యం ” అని ఎప్పుడూ గుర్తుచేసేలా రాఖీ-ఖాకీ ఒకే విధమైన ప్రాస ఉంటుందని పోస్ట్ చేశారు. దీనిపై నెటిజన్లు పోలీసులకు సెల్యూట్ అంటూ ప్రశంసిస్తున్నారు.

Tags:    

Similar News